
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా ఇవాళ (నవంబర్ 20) జరగాల్సిన రెండో టీ20 సజావుగా సాగేలా కనిపిస్తుంది. నిన్న వెదర్ ఫోర్‌కాస్ట్‌లో ఇవాళ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. క్రికెట్ ప్రేమికులంతా ఆందోళన చెందారు. అయితే, బే ఓవల్‌లో తాజా వాతావరణ పరిస్థితి చూస్తుంటే మ్యాచ్ సజావుగా సాగేలా కనిపిస్తుంది.
ఆకాశం క్లియర్‌గా ఉండి, ఎండ కాసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే వాతావరణం కంటిన్యూ అయితే మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా 20 ఓవర్ల పాటు సాగే అవకాశం ఉంది. కాగా, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నవంబర్ 18న జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment