ధర్మశాల వేదికగా నేడు (ఫిబ్రవరి 26) శ్రీలంకతో జరగనున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగతంగా గాను కెప్టెన్సీ పరంగానూ పలు రికార్డులను బద్ధలు కొట్టే అవకాశం ఉంది. తొలి టీ20 సందర్భంగా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించిన హిట్‌మ్యాన్.. నేడు జరగబోయే మ్యాచ్‌లో జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుకు ఎసరు పెట్టాడు. నేటి మ్యాచ్‌లో మరో 19 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొడతాడు.
ప్రస్తుతం టీ20ల్లో కెప్టెన్‌గా 981 పరుగులు చేసిన రోహిత్ నేటి మ్యాచ్‌లో మరో 19 పరుగులు చేస్తే 26 మ్యాచ్‌ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును కోహ్లి 30 మ్యాచ్‌ల్లో, ధోని 57 మ్యాచ్‌ల్లో సాధించారు. ఇక కెప్టెన్సీ పరంగానూ రోహిత్‌కు ఈ మ్యాచ్ గెలుపు చాలా కీలకం కానుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ టీమిండియాను గెలిపించగలిగితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ల రికార్డులను అధిగమిస్తాడు. స్వదేశంలో అత్యధిక టీ20లు గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
స్వదేశంలో ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా 16 టీ20ల్లో 15 విజయాలు సాధించగా, విలియమ్సన్, మోర్గాన్‌లు సైతం స్వదేశంలో ఇన్నే విజయాలతో(15) రోహిత్‌తో సమంగా నిలిచారు. శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా గెలిస్తే స్వదేశంలో అత్యధిక టీ20లు గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 24 టీ20ల్లో 22 మ్యాచ్‌లు గెలిచింది.
చదవండి: ‘11’వ విజయం వేటలో టీమిండియా.. లంకకు ఆపే దమ్ముందా
Comments
Please login to add a commentAdd a comment