Sri Lanka vs India, 1st ODI Updates: తొలి వన్డే అప్‌డేట్స్
ఉత్కంఠ పోరు.. భారత్-శ్రీలంక తొలి వన్డే టై
కొలంబో వేదికగా శ్రీలంక-భారత్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డే టైగా ముగిసింది. విజయానికి ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ డ్రా అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ టైగా ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది.
శ్రీలంక బ్యాటర్లలో ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే(65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక(56) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. దుబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్య చేధనలో భారత్ కూడా సరిగ్గా 230 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(31), శివమ్ దూబే(25), అక్షర్ పటేల్(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా, అసలంక తలా మూడువ వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలాగే రెండు ,అకిలా దనుంజయ, ఫెర్నాండో చెరో వికెట్ సాధించారు.
అక్షర్ పటేల్ ఔట్..
అక్షర్ పటేల్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. అసలంక బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 48 బంతుల్లో 27 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ ఔట్..
కేఎల్ రాహుల్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన రాహుల్.. హసరంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 58 బంతుల్లో 35 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(33), శివమ్ దూబే(3) పరుగులతో ఉన్నారు.
37 ఓవర్లకు భారత స్కోర్: 175/5
37 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(20), అక్షర్ పటేల్(24) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి 56 పరుగులు కావాలి.
ఐదో వికెట్ డౌన్..
శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన అయ్యర్.. అషితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటయ్యాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 149/5. క్రీజులో అక్షర్ పటేల్(11), కెఎల్ రాహుల్(8) ఉన్నారు.
విరాట్ కోహ్లి ఔట్
130 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన కోహ్లి.. హసరంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
23 ఓవర్లకు భారత్ స్కోర్: 130/3
23 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(22), విరాట్ కోహ్లి(24) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 101 పరుగులు కావాలి.
భారత్ మూడో వికెట్ డౌన్..
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. దనుంజయ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 86/2
రోహిత్ శర్మ ఔట్..
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. వెల్లగెలె బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్: 86/2
తొలి వికెట్ కోల్పోయిన భారత్
శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన గిల్.. వెల్లగలే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు. 12 ఓవర్లకు భారత్ స్కోర్: 76/1
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 71/0
దూకుడుగా ఆడుతున్న భారత్
231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ(29), శుబ్‌మన్ గిల్(10) పరుగులతో ఉన్నారు.
రాణించిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది.
శ్రీలంక బ్యాటర్లలో ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే(65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక(56) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. దుబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు.
ఏడో వికెట్ డౌన్
42.6: క్రీజులో కుదురుకున్న వనిందు హసరంగ(24)ను భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్‌కు పంపాడు. అర్ష్ వేసిన బంతిని తప్పుగా అంచనావేసిన హసరంగ.. అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రీలంక స్కోరు: 178-7(43). వనిందు స్థానంలో లెఫ్టాండ్ బ్యాటర్ అకిల ధనంజయ క్రీజులోకి వచ్చాడు. దునిత్ వెల్లలగే 39 పరుగులతో ఆడుతున్నాడు.
ఆరో వికెట్ కోల్పోయిన లంక
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జనిత్ లియనగే(20) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 35వ ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
శ్రీలంక ఐదో వికెట్ డౌన్..
నిస్సాంక రూపంలో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన నిస్సాంక.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 27 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 101/5
నిస్సాంక హాఫ్ సెంచరీ..
శ్రీలంక ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ సాధించాడు. 68 బంతుల్లో 9 ఫోర్లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక..
శ్రీలంక పేలవ ఫామ్ వన్డేల్లో కూడా కొనసాగుతోంది. తొలి వన్డేలో 91 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌గా కెప్టన్ అసలంక పెవిలియన్‌కు చేరాడు.
శ్రీలంక మూడో వికెట్ డౌన్..
శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సమరవిక్రమ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లకు శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.
శ్రీలంక రెండో వికెట్ డౌన్..
శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. శివమ్ దూబే బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 13.1 ఓవర్లకు శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.
10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 37/1
10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(25), కుశాల్ మెండిస్(7) ఉన్నారు.
లంక తొలి వికెట్ డౌన్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1).. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 7/1
భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. కొలంబోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌తో యువ ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ సిరాజ్ శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి భారత జట్టులో చేరారు.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్
శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment