ఇంగ్లండ్‌ విజయం | England beat Pakistan by 45 runs in second T20 to level series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ విజయం

Published Mon, Jul 19 2021 2:53 AM | Last Updated on Mon, Jul 19 2021 2:53 AM

England beat Pakistan by 45 runs in second T20 to level series - Sakshi

లీడ్స్‌: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్‌ 45 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత ఇంగ్లండ్‌ 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (39 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. లివింగ్‌స్టోన్‌ (23 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (16 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడారు. అనంతరం పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసి ఓడింది. రిజ్వాన్‌ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌), షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. సకీబ్‌ మొహమూద్‌ 3 వికెట్లు దక్కించుకోగా.. మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మూడో టి20 రేపు జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement