
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. యశస్వి జైస్వాల్ మూడు బంతుల్లో.. శుభ్‌మన్ గిల్ రెండు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే ఔటయ్యారు.
టీ20ల్లో భారత్ తరఫున ఓపెనర్లు ఇలా డకౌట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. 2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (మీర్పుర్) నాటి ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానేలు ఇలానే డకౌట్లు అయ్యారు. టీ20ల్లో భారత ఓపెనర్లు ఇద్దరూ డకౌట్లు కావడం అదే తొలిసారి. తాజాగా గిల్, యశస్వి ఇద్దరూ డకౌట్లై అనవసరపు అప్రతిష్టను మూటగట్టుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్లయ్యాక కూడా భారత ఆటగాళ్లు జోరు తగ్గించలేదు. సూర్యకుమార్ యాదవ్ (21), తిలక్ వర్మ ధాటిగా ఆడటంతో టీమిండియా 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అనంతరం తిలక్ 29 పరుగుల వద్ద ఔట్ కావడంతో భారత స్కోర్‌లో కాస్త వేగం తగ్గింది. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 69/3గా ఉంది. స్కై (30)తో పాటు రింకూ సింగ్ (6) క్రీజ్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment