ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి | IND VS AFG 2nd T20: Virat Kohli Will Be Playing His First T20I After 429 Days | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి

Published Sun, Jan 14 2024 12:36 PM | Last Updated on Sun, Jan 14 2024 12:50 PM

IND VS AFG 2nd T20: Virat Kohli Will Be Playing His First T20I After 429 Days - Sakshi

భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య ఇండోర్‌ వేదికగా ఇవాళ (జనవరి 14) రెండో టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కోహ్లి చివరిసారిగా 2022 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడాడు.  ఆ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.   

తిరిగి 429 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి మళ్లీ పొట్టి క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. వాస్తవానికి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే విరాట్‌ ఆడాల్సి ఉండింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌.. 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 

ఆఫ్ఘన్‌తో రెండో టీ20కి ముందు విరాట్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 35 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ (14562) పేరిట ఉంది. ఈ జాబతాలో పాకిస్తాన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ (12993), విండీస్‌ టీ20 స్పెషలిస్ట్‌ కీరన్‌ పోలార్డ్‌ (12430) గేల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement