జనవరి 11 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ (జనవరి 7) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. చాలాకాలం తర్వాత రోహిత్, విరాట్‌లు పొట్టి ఫార్మాట్‌లోకి (అంతర్జాతీయ క్రికెట్) రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవలే సౌతాఫ్రికాపై సెంచరీ (వన్డేలో) చేసిన సంజూ శాంసన్‌కు టీ20 జట్టులో చోటు లభించింది.
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో నిప్పులు చెరిగిన బుమ్రా, సిరాజ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. గాయాల కారణంగా ఇన్ ఫామ్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరమయ్యారు. వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ ఇంకా కోలుకోలేదని సెలెక్టర్లు చెప్పారు. ఈ ఏడాది జరుగునున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు.
రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. ప్రసిద్ద్ కృష్ణపై వేటు వేశారు. కాగా, ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆ జట్టుకు సారధిగా ఇబ్రహీం జద్రాన్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఇవాళే భారత్‌కు చేరుకున్నారు.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment