IND VS IRE 2nd T20: Team India Sets 186 Runs Target To Ireland, Ind Won The Match - Sakshi
Sakshi News home page

IND VS IRE 2nd T20: ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం

Published Sun, Aug 20 2023 9:15 PM | Last Updated on Mon, Aug 21 2023 10:17 AM

IND VS IRE 2nd T20: Team India Sets 186 Runs Target To Ireland - Sakshi

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 33 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 20) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా  భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 57; 6 ఫోర్లు, సిక్స్‌), సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్‌), రింకూ సింగ్‌ (26 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (18), తిలక్‌ వర్మ (1) విఫలం కాగా.. ఆఖర్లో శివమ్‌ దూబే (16 బంతుల్లో 22 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో బ్యారీ మెక్‌కార్తీ 2 వికెట్లు పడగొట్టగా.. క్రెయిగ్‌ యంగ్‌, బెంజమిన్‌ వైట్‌, మార్క్‌ అడైర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement