అష్రఫ్‌ హ్యాట్రిక్‌ | Ashraf hat trick :Sri Lankan 124/9 | Sakshi
Sakshi News home page

అష్రఫ్‌ హ్యాట్రిక్‌

Oct 28 2017 12:32 AM | Updated on Mar 23 2019 8:04 PM

Ashraf hat trick :Sri Lankan 124/9 - Sakshi

అబుదాబి: పాకిస్తాన్‌తో రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. గుణతిలక (48 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, సమరవిక్రమ (31 బంతుల్లో 32; 2 ఫోర్లు) రాణించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఒక దశలో 106/1తో పటిష్ట స్థితిలో నిలిచిన లంక 18 పరుగులకు తర్వాతి ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

జట్టులో ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. పేస్‌ బౌలర్‌ ఫహీమ్‌ అష్రఫ్‌ (3/16) ‘హ్యాట్రిక్‌’తో లంకను దెబ్బ తీశాడు. 19వ ఓవర్లో ఫహీమ్‌ వరుస బంతుల్లో ఉడానా, ఉదవట్, షనకలను అవుట్‌ చేశాడు. పాకిస్తాన్‌ తరఫున టి20ల్లో ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement