
డ్యునెడిన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్టిన్ గప్టిల్ (50 బంతుల్లో 97; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా, జిమ్మీ నీషమ్ (16 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. చివరి 7 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలో జత కలిసిన స్టొయినిస్ (37 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), డాన్ స్యామ్స్ (15 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి 40 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... వీరిద్దరు అవుట్ కావడంతో 10 పరుగులే వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment