వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్-ఏలో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్ (88), మ్యాక్స్ ఒడౌడ్ (59), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (83), ఆఖర్లో సకీబ్ జుల్ఫికర్ (34 నాటౌట్) చెలరేగడంతో డచ్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు స్కోర్ చేసింది.
జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా (4/55), రిచర్డ్ నగరవ (2/40) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా బౌలర్లను డచ్ బ్యాటర్లు ఆడుకున్నారు. జింబాబ్వే మొత్తం 8 మంది బౌలర్లను ప్రయోగించినా పరుగులను నియంత్రించలేకపోయింది. నెదర్లాండ్స్ కోల్పోయిన 6 వికెట్లలో 4 క్లీన్ బౌల్డ్ అయినవే కావడం విశేషం. సికందర్ రజా ముగ్గురిని, నగరవ ఒకరిని క్లీన్ బౌల్డ్ చేశారు.
షయాన్ జహంగీర్ సూపర్ సెంచరీ..
ఇవాలే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో యూఎస్‌ఏ-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ.. 49 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్ షయాన్ జహంగీర్ (79 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో యూఎస్‌ఏను ఆదుకున్నాడు. జహంగీర్‌కు సుశాంత్ మొదానీ (42), గజానంద్ సింగ్ (26) ఓ మోస్తరుగా సహకరించడంతో యూఎస్‌ఏ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కరణ్ 4, గుల్షన్ షా 3, దీపేంద్ర సింగ్ 2, లలిత్ రాజబంశీ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment