ఇవాళ (జూన్ 18) మొదలైన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023లో అనామక జట్టు నేపాల్.. వారి కంటే ఎన్నో రెట్లు మెరుగైన జింబాబ్వేను గడగడలాడిస్తుంది. నేపాల్ టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఓపెనర్ కుశాల్ భూర్టెల్ (95 బంతుల్లో 99; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించి, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మసకద్జ.. కుశాల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు.
మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మాల్ల (41), రోహిత్ పౌడెల్ (31) రాణించారు. 47 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 271/5గా ఉంది. గుల్సన్ ఝా (6), దీపేంద్ర సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవా తలో 2 వికెట్లు, టెండాయ్ చటారా ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు జింబాబ్వే వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. గ్రూప్-ఏలో భాగంగా నేపాల్-జింబాబ్వే జట్లు.. వెస్టిండీస్-యూఎస్‌ఏ జట్లు ఇవాళ తలపడుతున్నాయి. విండీస్-యూఎస్‌ఏ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న విండీస్.. 43 ఓవర్ల తర్వాత 243/6 స్కోర్ చేసింది. రోప్టన్ ఛేజ్ (45), జేసన్ హోల్డర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0) విఫలం కాగా.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), నికోలస్ పూరన్ (43) రాణించారు. యూఎస్‌ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్ 3, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్, నోషటష్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment