ICC Cricket World Cup Qualifiers 2023: వెస్టిండీస్‌కు ఇలాంటి గడ్డుకాలం వస్తుందని అస్సలు ఊహించలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించలేని దుస్థితికి చేరుకుంటామని అనుకోలేదని వాపోయాడు. కాగా ఒకప్పుడు క్రికెట్‌లో దేదీప్యమానంగా వెలుగొందిన వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2022, వన్డే ప్రపంచకప్-2023కి నేరుగా క్వాలిఫై కాలేకపోయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జింబాబ్వే వేదికగా ఆదివారం (జూన్ 18) నుంచి మొదలైన క్వాలిఫయర్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ అసిస్టెంట్ కోచ్ కార్ల్ హూపర్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘గతేడాదికి ఇప్పటికి మా స్థాయిలో ఎలాంటి మార్పులేదు.
ఇంతకంటే దిగజారడం అంటే
ఇంతకంటే దిగజారడం అంటూ ఇంకేమీ ఉండదు అనుకుంటే పొరపాటే! ఒకవేళ మేము వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయినట్లయితే పాతాళానికి పడిపోయినట్లే! ఐసీసీ టోర్నమెంట్లలో ఆడే క్రమంలో అర్హత సాధించేందుకు వెస్టిండీస్ ఇలా పాట్లు పడటం నేను బతికుండగా జరుగుతుందని అనుకోలేదు.
అప్పుడు ఆస్ట్రేలియాలో టీ20, ఇప్పుడు జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెట్టేందుకు ఇలా చెమటోడ్చాల్సి వస్తోంది. ఇతర జట్లను అవమానించడమో లేదంటే తక్కువ చేసి మాట్లాడటమనే ఉద్దేశం నాకు లేదు. నిజానికి జింబాబ్వేలో మేము అమెరికా, నేపాల్, స్కాట్లాండ్ వంటి జట్లతో పోటీ పడాల్సి ఉంది.
ఆఖరికి అఫ్గనిస్తాన్ కూడా!
ఆఖరికి అఫ్గనిస్తాన్ కూడా మాకంటే ముందే ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటికే వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెట్టింది. కానీ మేము.. మా స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో మేము యూఎస్‌ఏను సులభంగా ఓడిస్తామని అనుకుంటున్నాను’’ అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు.
కాగా హరారే వేదికగా ఆదివారం మొదలైన క్వాలిఫయర్స్‌లో విండీస్ యూఎస్‌ఏతో తలపడుతోంది. టాస్ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి షాయీ హోప్ బృందం 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కాగా ప్రపంచకప్ ఈవెంట్‌కు అర్హత సాధించే క్రమంలో రెండు బెర్త్‌ల కోసం వెస్టిండీస్‌తో పాటు శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, నేపాల్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, అమెరికా, ఒమన్, యూఏఈ బరిలో ఉన్నాయి.
చదవండి: రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Comments
Please login to add a commentAdd a comment