T20 WC 2022: Sikandar Raza Shines As Zimbabwe Sets 175 Runs Target To Ireland - Sakshi
Sakshi News home page

IRE VS ZIM: సికందర్‌ రజా విధ్వంసం.. జింబాబ్వే భారీ స్కోర్‌

Published Mon, Oct 17 2022 4:40 PM | Last Updated on Mon, Oct 17 2022 7:13 PM

T20 WC 2022: Sikandar Raza Shines As Zimbabwe Sets 175 Runs Target To Ireland - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌-బి క్వాలిఫయర్స్‌ రౌండ్‌లో ఇవాళ (అక్టోబర్‌ 17) రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్‌.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌పై సంచలన విజయం నమోదు చేయగా.. మరో మ్యాచ్‌లో జింబాబ్వే- ఐర్లాండ్‌ జట్లు తలపడుతున్నాయి. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. స్టార్‌ ప్లేయర్‌ సికందర్‌ రజా (48 బంతుల్లో 82; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను మెద్వెరె (19 బంతుల్లో 22; 4 ఫోర్లు), సికిందర్‌ రజా ఆదుకున్నారు. ఆఖర్లో జాంగ్వే (10 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో జింబాబ్వే ప్రత్యర్ధి ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సికిందర్‌ రజా ఒక్కడే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఐర్లాండ్‌ బౌలర్లలో జాషువా లిటిల్‌ (3/24), మార్క్‌ అదైర్‌ (2/39), సిమీ సింగ్‌ (2/31) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌.. రెండో బంతికే ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (0) వికెట్‌ కోల్పోయింది. అనంతరం 3వ ఓవర్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ లోర్కాన్‌ టక్కర్‌ (11) వికెట్‌ను చేజార్చుకుంది. ఈ రెండు వికెట్లు రిచర్డ్‌ నగరవకే దక్కాయి. 3 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ స్కోర్‌ 15/2గా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement