టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్-12కు అర్హత సాధించగా.. రేపు (అక్టోబర్ 21) గ్రూప్-బి నుంచి సూపర్-12కు అర్హత సాధించే జట్లు ఖరారవుతాయి. గ్రూప్-బి నుంచి సూపర్-12కు అర్హత సాధించే అవకాశాలున్న జట్లు ఏవో ఓసారి పరిశీలిస్తే..
గ్రూప్-ఏతో పోలిస్తే ఈ గ్రూప్ కాస్త కఠినంగా ఉందనే చెప్పాలి. టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే, తొలి మ్యాచ్‌లో విండీస్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన స్కాట్లాండ్, అదే స్కాట్లాండ్‌ను మట్టికరిపించిన అండర్ డాగ్ ఐర్లాండ్‌లతో ఈ గ్రూప్ చాలా టఫ్‌గా కనిపిస్తుంది.
Group B is delicately poised ahead of the final group games on Friday.
— Undisputed🎙️📺 (@Mr_Tich) October 19, 2022
Must win games for all teams to progress to Super 12.
Rain is forecast for Friday and could be a big factor.
Should games get washed out 🏴 and 🇿🇼 progress. pic.twitter.com/guSEclbMGY
ప్రస్తుతానికి నాలుగు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి తలో 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. రన్‌రేట్ ప్రకారం చూస్తే.. ఈ నాలుగు జట్లలో స్కాట్లాండ్ (+0.759) ముందువరుసలో ఉండగా.. జింబాబ్వే (0.000), వెస్టిండీస్ (-0.275), ఐర్లాండ్ (-0.468) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. రేపటి మ్యాచ్‌ల తర్వాత తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.
రేపటి మ్యాచ్‌లో తొలుత ఐర్లాండ్.. వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుంది. బలాబలాల ప్రకారం చూస్తే.. ఈ మ్యాచ్‌లో విండీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా అని ఐర్లాండ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేసిన విండీస్ ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. విండీస్‌ను మట్టికరిపించిన స్కాట్లాండ్‌ను ఓడించి ఐర్లాండ్ హుషారుగా కనిపిస్తుంది.
మరో మ్యాచ్ విషయానికొస్తే.. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్.. జింబాబ్వేతో తలపడుతుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధుల చేతుల్లో ఓడినప్పటికీ.. స్కాట్లాండ్‌పై జింబాబ్వేకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్కాట్లాండ్‌తో పోలిస్తే జింబాబ్వే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు నేరుగా సూపర్-12కు అర్హత సాధిస్తాయి. అంతిమంగా చూస్తే వెస్టిండీస్, జింబాబ్వే జట్లకే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే, గ్రూప్‌లో మొదటి స్థానంలో ఏ జట్టు నిలుస్తుందో అన్నది రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment