Group-b
-
గ్రూప్-ఏ బెర్తులు ఖరారు.. గ్రూప్-బి నుంచి ఎవరు..?
టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్-12కు అర్హత సాధించగా.. రేపు (అక్టోబర్ 21) గ్రూప్-బి నుంచి సూపర్-12కు అర్హత సాధించే జట్లు ఖరారవుతాయి. గ్రూప్-బి నుంచి సూపర్-12కు అర్హత సాధించే అవకాశాలున్న జట్లు ఏవో ఓసారి పరిశీలిస్తే.. గ్రూప్-ఏతో పోలిస్తే ఈ గ్రూప్ కాస్త కఠినంగా ఉందనే చెప్పాలి. టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే, తొలి మ్యాచ్‌లో విండీస్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన స్కాట్లాండ్, అదే స్కాట్లాండ్ను మట్టికరిపించిన అండర్ డాగ్ ఐర్లాండ్‌లతో ఈ గ్రూప్ చాలా టఫ్‌గా కనిపిస్తుంది. Group B is delicately poised ahead of the final group games on Friday. Must win games for all teams to progress to Super 12. Rain is forecast for Friday and could be a big factor. Should games get washed out 🏴 and 🇿🇼 progress. pic.twitter.com/guSEclbMGY — Undisputed🎙️📺 (@Mr_Tich) October 19, 2022 ప్రస్తుతానికి నాలుగు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి తలో 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. రన్‌రేట్ ప్రకారం చూస్తే.. ఈ నాలుగు జట్లలో స్కాట్లాండ్ (+0.759) ముందువరుసలో ఉండగా.. జింబాబ్వే (0.000), వెస్టిండీస్ (-0.275), ఐర్లాండ్ (-0.468) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. రేపటి మ్యాచ్‌ల తర్వాత తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. రేపటి మ్యాచ్‌లో తొలుత ఐర్లాండ్.. వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుంది. బలాబలాల ప్రకారం చూస్తే.. ఈ మ్యాచ్‌లో విండీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా అని ఐర్లాండ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేసిన విండీస్ ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. విండీస్‌ను మట్టికరిపించిన స్కాట్లాండ్ను ఓడించి ఐర్లాండ్ హుషారుగా కనిపిస్తుంది. మరో మ్యాచ్ విషయానికొస్తే.. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్.. జింబాబ్వేతో తలపడుతుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధుల చేతుల్లో ఓడినప్పటికీ.. స్కాట్లాండ్పై జింబాబ్వేకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్కాట్లాండ్తో పోలిస్తే జింబాబ్వే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు నేరుగా సూపర్-12కు అర్హత సాధిస్తాయి. అంతిమంగా చూస్తే వెస్టిండీస్, జింబాబ్వే జట్లకే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే, గ్రూప్‌లో మొదటి స్థానంలో ఏ జట్టు నిలుస్తుందో అన్నది రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది. -
సఫారీ తడ‘బ్యాటు’..పాక్‌కు స్వల్ప లక్ష్యం
► రాణించిన మిల్లర్ బర్మింగ్ హోమ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో పాక్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. డెవిడ్ మిల్లర్ (75; 1ఫోర్, 3 సిక్పర్లు) ఒంటిరి పోరాటం చేయడంతో దక్షిణాఫ్రికా పాక్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆమ్లా(16) వికెట్‌తో సఫారీల వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా డికాక్(33; 2 ఫోర్లు), కెప్టెన్ డివిలియర్స్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగడంతో ఆ జట్టు 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డూప్లేసిస్ (26), డుమినీ(8), పార్నెల్ కూడా డకౌటవ్వడంతో 118 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులో వచ్చిన మిల్లర్, క్రిస్ మొర్రిస్తో ఒంటరి పోరాటం చేశాడు. కొద్దిసేపటి తరువాత క్రిస్మొర్రిస్ (28)కూడా అవుటడయ్యాడు. ఈ తరుణంలో 83 బంతుల్లో మిల్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రబడాతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రబడా(26)ను జునైద్ పేవిలియన్‌కు చేర్చాడు. దీంతో సఫారీలు నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేశారు. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ(3), ఇమాద్ వసీం(2), జునైద్ ఖాన్(2) హఫీజ్ (1) వికెట్లు తీశారు. డివిలియర్స్ తన వన్డే క్రికెట్ కెరీర్లో తొలిసారి గోల్డెన్ డకౌటయ్యాడు. -
డివిలియర్స్ గోల్డెన్ డక్.. కష్టాల్లో దక్షిణాఫ్రికా
► 37 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 140/6 బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో పాక్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన డివిలియర్స్ సేన ఓపెనర్లు ఆమ్లా, డికాక్‌లు ఆచితూచి ఆడారు. పాక్ బౌలర్ ఇమాద్ వసీం వేసిన 8 ఓవర్లో ఆమ్లా(16) ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో దక్షిణాఫ్రికా వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా డికాక్(33; 2 ఫోర్లు), కెప్టెన్ డివిలియర్స్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగడంతో ఆ జట్టు 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డూప్లేసిస్ (26) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా హసన్ అలీ అడ్డుకున్నాడు. డుమినీ(8), పార్నెల్ కూడా డకౌటవ్వడంతో 118 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో మిల్లర్(40; 2 సిక్పర్లు), క్రిస్ మొర్రిస్(10)లు పోరాడుతున్నారు. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ(3), ఇమాద్ వసీం(2), హఫీజ్ (1) వికెట్లు తీశారు. ఇక డివిలియర్స్ వన్డే కెరీర్లో తొలిసారి గోల్డెన్ డకౌటయ్యాడు. -
చాంపియన్స్ ట్రోఫీ: టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా
బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో పాకిస్థాన్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్నమ్యాచ్ లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై విజయంతో జోరు మీదున్న డివిలియర్స్ సేన ఈ మ్యాచ్ నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తుంది. ఇక భారత్ తో చిత్తుగా ఓడిన పాక్ కు ఈ మ్యాచ్ చావో రేవో అన్నట్లు మారింది. టోర్నీలో కొనసాగలంటే పాక్ ఈ మ్యాచ్ తప్పనిసరి గెలవాలి. అయితే పాక్ ఈ మ్యాచ్ కు స్వల్ప మార్పులు చేసింది. వాహాబ్, షేహజాద్ స్థానంలో జునైద్ ఖాన్, ఫకార్ జమాన్ లను తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతుంది. టాస్ నెగ్గిన డివిలియర్స్ బ్యాటింగ్ కే మొగ్గు చూపాడు. గత శ్రీలంక మ్యాచ్ లో కూడా తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డివిలియర్స్ తెలిపాడు. తుది జట్లు పాకిస్థాన్: సర్ఫరాజ్ అహ్మద్( కెప్టెన్), అజార్ అలీ, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్,ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్, షాదాబ్ ఖాన్, హాసన్ అలీ, జునైద్ ఖాన్ దక్షిణాఫ్రికా: ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), డికాక్, ఆమ్లా, డూప్లెసిస్, మిల్లర్, డుమిని, క్రిస్ మొర్రిస్, పార్నెల్, రబడా, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్