డివిలియర్స్ గోల్డెన్ డక్.. కష్టాల్లో దక్షిణాఫ్రికా
డివిలియర్స్ గోల్డెన్ డక్.. కష్టాల్లో దక్షిణాఫ్రికా
Published Wed, Jun 7 2017 8:39 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM
► 37 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 140/6
బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో పాక్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన డివిలియర్స్ సేన ఓపెనర్లు ఆమ్లా, డికాక్‌లు ఆచితూచి ఆడారు. పాక్ బౌలర్ ఇమాద్ వసీం వేసిన 8 ఓవర్లో ఆమ్లా(16) ఎల్బీగా వెనుదిరిగాడు.
ఈ వికెట్‌తో దక్షిణాఫ్రికా వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా డికాక్(33; 2 ఫోర్లు), కెప్టెన్ డివిలియర్స్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగడంతో ఆ జట్టు 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డూప్లేసిస్ (26) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా హసన్ అలీ అడ్డుకున్నాడు. డుమినీ(8), పార్నెల్ కూడా డకౌటవ్వడంతో 118 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో మిల్లర్(40; 2 సిక్పర్లు), క్రిస్ మొర్రిస్(10)లు పోరాడుతున్నారు. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ(3), ఇమాద్ వసీం(2), హఫీజ్ (1) వికెట్లు తీశారు. ఇక డివిలియర్స్ వన్డే కెరీర్‌లో తొలిసారి గోల్డెన్ డకౌటయ్యాడు.
Advertisement
Advertisement