చాంపియన్స్ ట్రోఫీ: టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా
చాంపియన్స్ ట్రోఫీ: టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా
Published Wed, Jun 7 2017 6:01 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM
బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో పాకిస్థాన్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్నమ్యాచ్ లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై విజయంతో జోరు మీదున్న డివిలియర్స్ సేన ఈ మ్యాచ్ నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తుంది. ఇక భారత్ తో చిత్తుగా ఓడిన పాక్ కు ఈ మ్యాచ్ చావో రేవో అన్నట్లు మారింది. టోర్నీలో కొనసాగలంటే పాక్ ఈ మ్యాచ్ తప్పనిసరి గెలవాలి. అయితే పాక్ ఈ మ్యాచ్ కు స్వల్ప మార్పులు చేసింది.
వాహాబ్, షేహజాద్ స్థానంలో జునైద్ ఖాన్, ఫకార్ జమాన్ లను తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతుంది. టాస్ నెగ్గిన డివిలియర్స్ బ్యాటింగ్ కే మొగ్గు చూపాడు. గత శ్రీలంక మ్యాచ్ లో కూడా తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డివిలియర్స్ తెలిపాడు.
తుది జట్లు
పాకిస్థాన్: సర్ఫరాజ్ అహ్మద్( కెప్టెన్), అజార్ అలీ, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్,ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్, షాదాబ్ ఖాన్, హాసన్ అలీ, జునైద్ ఖాన్
దక్షిణాఫ్రికా: ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), డికాక్, ఆమ్లా, డూప్లెసిస్, మిల్లర్, డుమిని, క్రిస్ మొర్రిస్, పార్నెల్, రబడా, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్
Advertisement
Advertisement