సఫారీ తడ‘బ్యాటు’..పాక్‌కు స్వల్ప లక్ష్యం
సఫారీ తడ‘బ్యాటు’..పాక్‌కు స్వల్ప లక్ష్యం
Published Wed, Jun 7 2017 9:52 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM
► రాణించిన మిల్లర్
బర్మింగ్ హోమ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో పాక్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. డెవిడ్ మిల్లర్ (75; 1ఫోర్, 3 సిక్పర్లు) ఒంటిరి పోరాటం చేయడంతో దక్షిణాఫ్రికా పాక్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆమ్లా(16) వికెట్‌తో సఫారీల వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా డికాక్(33; 2 ఫోర్లు), కెప్టెన్ డివిలియర్స్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగడంతో ఆ జట్టు 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
డూప్లేసిస్ (26), డుమినీ(8), పార్నెల్ కూడా డకౌటవ్వడంతో 118 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులో వచ్చిన మిల్లర్, క్రిస్ మొర్రిస్‌తో ఒంటరి పోరాటం చేశాడు. కొద్దిసేపటి తరువాత క్రిస్‌మొర్రిస్ (28)కూడా అవుటడయ్యాడు. ఈ తరుణంలో 83 బంతుల్లో మిల్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రబడాతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రబడా(26)ను జునైద్ పేవిలియన్‌కు చేర్చాడు. దీంతో సఫారీలు నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేశారు. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ(3), ఇమాద్ వసీం(2), జునైద్ ఖాన్(2) హఫీజ్ (1) వికెట్లు తీశారు. డివిలియర్స్ తన వన్డే క్రికెట్ కెరీర్‌లో తొలిసారి గోల్డెన్ డకౌటయ్యాడు.
Advertisement