700 వికెట్ల క్లబ్‌లో హర్భజన్
న్యూఢిల్లీ : భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 700 వికెట్ల క్లబ్‌లో చేరాడు. జింబాబ్వేతో మంగళవారం జరిగిన మూడో వన్డేలో సికిందర్ రజా వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 700 వికెట్లు తీసిన జాబితాలో 12వ స్థానంలో ఉన్న భజ్జీ భారత్ తరఫున రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇతని కంటే ముందున్నాడు. టాప్-5లో ముత్తయ్య మురళీధరన్ (1347), షేన్ వార్న్ (1001), అనిల్ కుంబ్లే (956), మెక్‌గ్రాత్ (949), వసీమ్ అక్రమ్ (916) ఉన్నారు. 435 ఇన్నింగ్స్‌లో హర్భజన్ ఈ మార్క్‌ను సాధించగా, మురళీధరన్ 308 ఇన్నింగ్స్‌లోనే అందుకున్నాడు.