Harbhajan Singh Set To Join Support Staff Of IPL Franchise: టీమిండియా వెటరన్ స్పిన్నర్, కేకేఆర్ స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ త్వరలో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌తో పాటు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాలని అతను నిర్ణయించుకున్నట్లు సమాచారం. భజ్జీ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఐపీఎల్‌లో ప్రముఖ ఫ్రాంఛైజీ బౌలింగ్ కోచ్‌గా లేదా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్-2022కు జరుగబోయే వేలంలో భజ్జీ.. సదరు ఫ్రాంఛైజీ తరఫున కీలకంగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. భజ్జీకి కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు భారీ అఫర్లు ప్రకటించినట్లు సమాచారం. ఈ రెండు జట్లలో ఏదైనా ఓ జట్టును ఎంచుకుని భజ్జీ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
భారత్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ సీజన్ తొలి అంచెలో భజ్జీ చివరిసారిగా మైదానంలో కనిపించాడు. దుబాయ్ వేదికగా జరిగిన సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లలో తుది జట్టులో ఆడనప్పటికీ.. జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. 41 ఏళ్ల భజ్జీ.. 1998లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరఫున 103 టెస్టుల్లో 417 వికెట్లు.. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు తీసిన భజ్జీ.. ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. హర్భజన్ ఖాతాలో రెండు టెస్ట్ సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో మొత్తంలో 163 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ 150 వికెట్లు తీసి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచాడు.
చదవండి: కోహ్లి అశ్విన్‌ను ఆడించకపోవచ్చు.. ఇంగ్లండ్ మాజీ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment