ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్‌గా కొట్టేశాడు | Batsman Smashes 6 Sixes In Single Over ECS T10 Krefeld Game Became Viral | Sakshi
Sakshi News home page

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్‌గా కొట్టేశాడు

Published Fri, May 21 2021 5:13 PM | Last Updated on Fri, May 21 2021 9:29 PM

Batsman Smashes 6 Sixes In Single Over ECS T10 Krefeld Game Became Viral - Sakshi

లండన్‌: క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌. 2007 టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత ఇలాంటి రికార్డులు చాలానే చూశాం. దక్షిణాఫ్రికా నుంచి హర్షలే గిబ్స్‌, శ్రీలంక నుంచి తిసార పెరీరా.. ఈ మధ్యనే విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. మొన్నటికి మొన్న ఐపీఎ‍ల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ జడేజా ఒకే ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు బాది.. ఆఖరిబంతికి ఫోర్‌ కొట్టడంతో తృటిలో రికార్డును మిస్‌ అయ్యాడు.

 తాజాగా  ఆ అద్భుతం మరోసారి చోటుచేసుకుంది. అయితే ఈసారి ఇది జరిగింది యూరోపియన్‌ క్రికెట్‌ డొమెస్టిక్‌ లీగ్‌లో. విషయంలోకి వెళితే.. ఈసీఎస్‌ టీ10 పేరిట జరుగుతున్న టోర్నీలో శుక్రవారం బేయర్‌ ఉర్డింజిన్‌ బూస్టర్స్‌ , కోన్‌ చాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. బేయర్‌ ఉర్డింజిన్‌ బ్యాట్స్‌మన్‌ అరితరన్‌ వసీకరణ్‌ ఆయుష్‌ శర్మ బౌలింగ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ఈ మ్యాజిక్‌ చోటుచేసుకుంది.

ఆయుష్‌ శర్మ వేసిన ఆరు బంతులను వరుసగా.. మిడ్‌ వికెట్‌, మిడ్‌ వికెట్‌,స్క్వేర్‌లెగ్‌, మిడ్‌ వికెట్‌, స్క్వేర్‌లెగ్‌, మిడాన్‌ దిశగా ఆరు సిక్సుల బాదాడు. అతను క్రీజులోకి వచ్చేసరికి జట్టు స్కోరు 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఉంది. అతని సిక్సర్ల దెబ్బకు ఒక్క ఓవర్‌ తిరిగే సరికి బూస్టర్స్‌ స్కోరు 5 ఓవర్లలో 57/3గా నమోదైంది. మొత్తంగా వసీకరణ్‌ 25 బంతులెదుర్కొని 61 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు.. మూడు బౌండరీలు ఉన్నాయి. కాగా బూస్టర్స్‌ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఎ‍క్కడ దొరకలేదు.. కానీ కొంతమంది నెటిజన్లు తమ ట్విటర్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. 
చదవండి: జడేజా పేసర్‌ అయితే బాగుండు.. మాకు చాన్స్‌ వచ్చేది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement