షర్ట్‌ లేకుండా పరిగెత్తాడు.. చివరికి | Hillarious Video Of Fielder Changing Jersy Ball Hit 4Runs In T10 League | Sakshi
Sakshi News home page

వైరల్‌: షర్ట్‌ లేకుండా పరిగెత్తాడు.. చివరికి

Published Tue, Feb 2 2021 6:57 PM | Last Updated on Tue, Feb 2 2021 9:00 PM

Hillarious Video Of Fielder Changing Jersy Ball Hit 4Runs In T10 League - Sakshi

దుబాయ్‌: అబుదాబి టీ10 లీగ్‌లో సోమవారం రాత్రి నార్తన్‌ వారియర్స్‌, టీమ్‌ అబుదాబి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమ్‌ అబుదాబి ఆటగాడు రోహన్‌ ముస్తఫా చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. నార్తన్‌ వారియర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఒక ఓవర్‌లో రోహన్‌ తన జెర్సీని సరిచేసుకునే పనిలో పడ్డాడు. అయితే ఇది గమనించని బౌలర్‌ బంతి వేయగా నార్తన్‌ వారియర్స్‌ బ్యాట్స్‌మన్‌.. రోహన్‌ దిశగా షాట్‌ ఆడాడు.

అప్పటికీ జెర్సీని వేసుకునే పనిలో ఉన్న రోహన్‌.. బంతి తన దగ్గరికి రావడంతో జెర్సీ చేతిలో పట్టుకుని పరిగెత్తాడు. అయితే బంతి అప్పటికే బౌండరీ దాటేసింది. రోహన్‌ ముస్తఫా తన జెర్సీని వేసుకుంటున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. దీంతో వారియర్స్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ ముస్తఫా వీడియోనూ చూసి నవ్వాపుకోలేకపోయాడు. దీనిని ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చదవండి: ఒక్క టెస్ట్‌.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ 6 వికెట్ల తేడాతో టీమ్‌ అబుదాబిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ అబుదాబి 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.లూక్‌ రైట్‌ 25 పరుగులు, జో క్లార్క్‌ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తన్‌ వారియర్స్‌ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కామెరాన్‌ డెల్‌పోర్ట్‌ 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కీరన్‌ పొలార్డ్‌ 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. చదవండి: క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. లాభపడిన కివీస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement