మహ్మద్ షెహ్‌జాద్(ఫైల్‌ఫొటో)
షార్జా: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ షెహ్‌జాద్ రెచ్చిపోయాడు. కేవలం 16బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అజేయంగా 74 పరుగులు సాధించిన షెహ్‌జాద్.. 72 పరుగుల్ని ‘బౌండరీ’ల రూపంలోనే సాధించాడంటే అతని సుడిగాలి ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు
టీ10 లీగ్ రెండో సీజన్‌లో భాగంగా ఆరంభపు మ్యాచ్‌లోనే షెహ్‌జాద్ మెరుపులు మెరిపించాడు. సింధిస్ విసిరిన 95 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో షెహజాద్, మెకల్లమ్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. ఒకవైపు మెకల్లమ్ ఆచితూచి ఆడితే, షెహ్‌జాద్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన షెహ్‌జాద్.. టీ10లీగ్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును కూడా నమోదు చేశాడు.
షేన్ వాట్సన్ మినహా..
ప్రత్యర్థి జట్టు సింధిస్ 94/6 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సింధిస్ జట్టులో షేన్ వాట్సన్ (20 బంతుల్లో 42 పరుగులు) మాత్రమే ఆకట్టుకోగా, మిగిలినవారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment