Faf Du Plessis Says T10 Cricket Format Can Be Used In Olympics: అబుదాబి వేదికగా నవంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న టీ10 లీగ్ నేపథ్యంలో ఈ అతి పొట్టి ఫార్మాట్‌పై దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ10 ఫార్మాట్‌లో తొలిసారి ఆడనున్న డుప్లెసిస్.. అబుదాబి టీ10 టోర్నీలో బంగ్లా టైగర్స్ తరఫున ప్రాతనిధ్యం వహించనున్నాడు. ఈ జట్టుకు సారధ్యం వహించనున్న డెప్లెసిస్.. టోర్నీ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
క్రికెట్‌లో గుర్తింపు పొందిన అతి పొట్టి ఫార్మాట్(టీ10)లో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నానని అన్నాడు. సమీప భవిష్యత్తులో టీ20 క్రికెట్ మరుగున పడి, టీ10 క్రికెట్ రాజ్యమేలుతుందని జోస్యం చెప్పాడు. స్వల్ప వ్యవధిలో ముగిసే ఈ ఫార్మాట్‌కు ప్రేక్షకులు మరింతగా ఆకర్షితులవుతారని, ఇదే ఫార్మాట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బిడ్ వేసేందుకు ఐసీసీ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసుకుంది.
చదవండి: పాక్ క్రికెట్‌కు గుడ్ టైమ్.. రానురానన్న జట్లే క్యూ కడుతున్నాయ్..!
Comments
Please login to add a commentAdd a comment