
జింబాబ్వే క్రికెట్ మరియు టీ టెన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. జులై 20 నుంచి ప్రారంభంకాబోయే ఈ లీగ్‌లో 5 ప్రాంచైజీలు (బులవాయో బ్రేవ్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, డర్బన్ ఖలందర్స్, హరారే హరికేన్స్, జోహనెస్‌బర్గ్ బఫెలోస్) 24 మ్యాచ్‌ల్లో తలపడతాయి. లీగ్‌లో జరుగబోయే మ్యాచ్‌లన్నిటికీ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది.
మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం 11:30 గంటలకు, 1:30 గంటలకు.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు (20), రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, తదనంతరం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
- జులై 20: హరారే హరికేన్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (3:30)
- జులై 21: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (11:30)
- జులై 21: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30)
- జులై 21: హరారే హరికేన్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (3:30)
- జులై 22: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (11:30)
- జులై 22: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30)
- జులై 22: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ హరారే హరికేన్స్ (3:30)
- జులై 23: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (11:30)
- జులై 23: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ కేప్‌టౌన్ కాంప్ ఆర్మీ (1:30)
- జులై 23: హరారే హరికేన్స్ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (3:30)
- జులై 24: బులవాయో బ్రేవ్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (1:30)
- జులై 24: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (3:30)
- జులై 25: కేప్‌టౌన్ వర్సెస్ హరారే హరికేన్స్ (11:30)
- జులై 25: బులవాయో వర్సెస్ డర్బన్ (1:30)
- జులై 25: హరారే వర్సెస్ జోబర్గ్ (3:30)
- జులై 26: బులవాయో వర్సెస్ హరారే (11:30)
- జులై 26: డర్బన్ వర్సెస్ కేప్‌టౌన్ (1:30)
- జులై 26: బులవాయో వర్సెస్ జోబర్గ్ (3:30)
- జులై 27: డర్బన్ వర్సెస్ హరారే (11:30)
- జులై 27: కేప్‌టౌన్ వర్సెస్ జోబర్గ్ (3:30)
- జులై 28: క్వాలిఫయర్ 1 (11:30)
- జులై 28: ఎలిమినేటర్ (1:30)
- జులై 28: క్వాలిఫయర్ 2 (3:30)
- జులై 29: ఫైనల్ (1:30)
లీగ్‌లో ఆడబోయే భారత ఆటగాళ్లు..
- స్టువర్ట్ బిన్నీ
- పార్థివ్ పటేల్
- రాబిన్ ఉతప్ప
- శ్రీశాంత్
- ఇర్ఫాన్ పఠాన్
- యూసఫ్ పఠాన్
Squad Check 🗒️
— T10 League (@T10League) July 3, 2023
A look at all the rosters after the #ZimAfroT10Draft! 🔥
Which team do you reckon are the early favorites for the inaugural #ZimAfroT10? 🏆#T10League #CricketsFastestFormat pic.twitter.com/JXMx5xnNBU
Comments
Please login to add a commentAdd a comment