Robin Uthappa's sensational show sees Harare Hurricanes bagging Eliminator against Cape Town Samp Army - Sakshi
Sakshi News home page

Zim Afro T10: రాబిన్ ఉతప్ప విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్‌

Published Sat, Jul 29 2023 10:26 AM | Last Updated on Sat, Jul 29 2023 10:40 AM

Robin Uthappas sensational show sees Harare Hurricanes  - Sakshi

జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌లో ఫైనల్‌ చేరడంలో హరారే హరికేన్స్ జట్టు విఫలమైంది. డర్బన్ క్వాలండర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో 4 వికెట్ల తేడాతో డర్బన్ క్వాలండర్స్‌ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి హరారే నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హరికేన్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది.

హరారే బ్యాటర్లలో సమిత్‌ పటేల్‌(39) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. డర్బన్‌ బౌలర్లో ఈవెన్స్‌ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 83 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి డర్బన్‌ ఛేదించింది. దీంతో తమ ఫైనల్‌ బెర్త్‌ను డర్బన్‌ ఖారారు చేసుకుంది. జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్‌ జట్లు తలపడనున్నాయి.

రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప..
ఇక అంతకుముందు కేప్ టౌన్ సాంప్ ఆర్మీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భారత మాజీ ఆటగాడు, హరారే హరికేన్స్ కెప్టెన్‌ రాబిన్‌ ఉతప్ప ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఉతప్ప విద్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో..  146 లక్ష్యాన్ని హరికేన్స్‌ ​కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే నష్టపోయి ఛేదించింది. అతడితో పాటు ఫెరీరా(35) రాణించాడు.

అయితే ఎలిమినేటర్‌లో అద్బుత విజయం సాధించినప్పటికీ.. క్వాలిఫయర్‌-2లో ఓటమి పాలకావడంతో హరారే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. కాగా ఉతప్ప ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిAshes 2023 Steve Smith Run Out Video: ఔటని వెళ్లిపోయిన స్మిత్‌.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం! వీడియో వైర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement