Abu Dhabi T10 League: Liam Livingstone Scored 68 Runs Off 23 Balls in Abu Dhabi - Sakshi
Sakshi News home page

Liam Livingstone: టి10 లీగ్‌లో లివింగ్‌స్టోన్‌ సంచలన ఇన్నింగ్స్‌

Published Sun, Nov 21 2021 4:26 PM | Last Updated on Sun, Nov 21 2021 4:47 PM

Liam Livingstone Smash 8 Sixes Terrific Innings Won Match T10 League - Sakshi

Liam Livingstone Smash 8 Sixes In T10 League Tourney.. యూఏఈ వేదికగా జరుగుతున్న టి10 లీగ్‌లో భాగంగా శనివారం నార్తన్‌ వారియర్స్‌, టీమ్‌ అబుదాబి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో లివింగ్‌స్టోన్‌ 68 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో టీమ్‌ అబుదాబి 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ 68, ఫిలిప్‌ సాల్ట్‌ 29 పరుగులు మినహా మిగతావారు విఫలమ్యారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన నార్తన్‌ వారియర్స్‌ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగలిగింది. నార్తన్‌ వారియర్స్‌ బ్యాటింగ్‌లో రోవ్‌మన్‌ పావెల్‌ 42 టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెన్నర్‌ లూయిస్‌ 35 పరుగులు చేశాడు. టీమ్‌ అబుదాబి బౌలింగ్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌, డాని బ్రిగ్స్‌, మర్చంట్‌ డీ లాంజ్‌ తలా రెండు వికెట్లు తీశారు. 

చదవండి: chris gayle: క్రిస్‌ గేల్‌ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement