అబుదాబీ టీ10 లీగ్‌లో మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ జట్టు ఫైనల్‌కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన క్వాలిఫయర్-2లో సాంప్ ఆర్మీ.. ఢిల్లీ బుల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.
టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్‌మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇసురు ఉడాన 3, అమీర్ హమ్జా 2, ఇమాద్ వసీం, కరీం జనత్ తలో వికెట్ తీసి ఢిల్లీ బుల్స్‌ను కట్టడి చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ మరో ఐదు బంతులు మిగిలుండగానే (ఐదు వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆండ్రియస్ గౌస్ (38), జాక్ టేలర్ (23 నాటౌట్) సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
జాక్ టేలర్ తొమ్మిదో ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది సాంప్ ఆర్మీని గెలిపించాడు. ఇవాళ రాత్రి 9 గంటలకు జరిగే ఫైనల్లో సాంప్ ఆర్మీ.. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment