అబుదాబీ టీ10 లీగ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనక చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ లీగ్‌లో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షనక.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేసిన షనక తొలి నాలుగు బంతులకు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఇందులో రెండో నో బాల్స్ ఉన్నాయి. అనంతరం ఐదో బంతి సిక్సర్ కాగా.. ఆరో బంతి నో బాల్ అయ్యింది. తిరిగి ఏడో బంతి కూడా నో బాల్ కాగా.. ఈ బంతి బౌండరీకి తరలివెళ్లింది.
మొత్తంగా షనక ఓవర్ తొలి మూడు బంతుల్లో 4 నో బాల్స్ వేశాడు. దీంతో మూడు బంతులు ఏడు బంతులయ్యాయి. ఏడు బంతుల్లో బ్యాటర్ నిఖిల్ చౌదరీ ఐదు బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఓ బాల్ డాట్ బాల్‌గా మారింది. ఓవర్ చివరి మూడు బంతులకు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్‌లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి.
ఢిల్లీ బుల్స్, బంగ్లా టైగర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. బుల్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిథ్ 1, టామ్ బాంటన్ 8, జేమ్స్ విన్స్ 27, రోవ్‌మన్ పావెల్ 17, టిమ్ డేవిడ్ 1, షాదాబ్ ఖాన్ 10 (నాటౌట్), ఫేబియన్ అలెన్ 6 పరుగులు చేశారు.
ఆఖర్లో నిఖిల్ చౌదరీ మెరుపు వేగంతో 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. లియామ్ లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించడంతో 9.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment