కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్న డుప్లెసిస్‌.. వీడియో | Abu Dhabi T10 League: Faf Du Plessis Takes Sensational Single Hand Catch Of Shadab Khan | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్న డుప్లెసిస్‌.. వీడియో

Published Mon, Dec 2 2024 7:28 PM | Last Updated on Mon, Dec 2 2024 7:45 PM

Abu Dhabi T10 League: Faf Du Plessis Takes Sensational Single Hand Catch Of Shadab Khan

అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా ఢిల్లీ బుల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మోరిస్‌విల్లే సాంప్‌ ఆర్మీ ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్నాడు. అమీర్‌ హంజా బౌలింగ్‌లో షాదాబ్‌ ఖాన్‌ కొట్టిన బంతిని డుప్లెసిస్‌ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. 

ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ఇది జరిగింది. ఈ ఓవర్‌లో డుప్లెసిస్‌ రెండు క్యాచ్‌లు పట్టాడు. షాదాబ్‌ ఖాన్‌ క్యాచ్‌కు ముందు డుప్లెసిస్‌ టామ్‌ బాంటన్‌ క్యాచ్‌ కూడా పట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ మొత్తంగా మూడు క్యాచ్‌లు పట్టాడు. ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌లో మరో సూపర్‌ క్యాచ్‌తో డుప్లెసిస్‌ రోవ్‌మన్‌ పావెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. 40 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్‌ మైదానంలో పాదరసంలా కదలడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ బుల్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇసురు ఉడాన 3, అమీర్‌ హంజా 2, కరీం జనత్‌, ఇమాద్‌ వసీం తలో వికెట్‌ పడగొట్టి ఢిల్లీ బుల్స్‌ను కట్టడి చేశారు. 

ఢిల్లీ బుల్స్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ డేవిడ్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. నిఖిల్‌ చౌదరీ (16), రోవ్‌మన్‌ పావెల్‌ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement