అబుదాబీ టీ10 లీగ్ 2024 ఎడిషన్ విజేతగా డెక్కన్ గ్లాడియేటర్స్ అవతరించింది. మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీతో నిన్న (డిసెంబర్ 2) జరిగిన ఫైనల్లో గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్), వికెట్‌కీపర్ ఆండ్రియస్ గౌస్ (9 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) ఓ మోస్తరు పరుగులు చేశారు. షర్జీల్ ఖాన్ 5, అసలంక 13, జాక్ టేలర్ 1, కరీమ్ జనత్ 16 (నాటౌట్), రోహన్ ముస్తఫా 0, ఇమాద్ వసీం 7, ఖైస్ అహ్మద్ 1 (నాటౌట్) పరుగు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, తీక్షణ, నోర్జే, ఉస్మాన్ తారిక్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేర్స్.. టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ (21 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో 6.5 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది.
ఆఖర్లో రిలీ రొస్సో (5 బంతుల్లో 12; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. జోస్ బట్లర్ (5 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ఇది మూడో టైటిల్. 2021-22, 2022 ఎడిషన్లలో కూడా గ్లాడియేటర్స్ ఛాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment