వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించిన ఫించ్‌.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో..! | US Masters T10 League 2023: Aaron Finch Scores Blasting 50 In Consecutive Matches | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించిన ఫించ్‌.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో..!

Published Tue, Aug 22 2023 9:07 PM | Last Updated on Tue, Aug 22 2023 9:14 PM

US Masters T10 League 2023: Aaron Finch Scores Blasting 50 In Consecutive Matches - Sakshi

యూఎస్‌ మాస్టర్స్‌ టీ10 లీగ్‌ 2023లో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (కాలిఫోర్నియా నైట్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. న్యూజెర్సీ లెజెండ్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 21) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో  అజేయమైన 75 పరుగులు చేసిన ఫించ్‌.. ఇవాళ (ఆగస్ట్‌ 22) మోరిస్‌విల్లే యూనిటీపై 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 63 పరుగులు చేసి, తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు.

ఫించ్‌ ఒక్కడే ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కాలిఫోర్నియా నైట్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఫించ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో అజేయమైన అర్ధశతకం సాధించగా.. జాక్‌ కలిస్‌ (9), మిలింద్‌ కుమార్‌ (6), సురేశ్‌ రైనా (6), ఇర్ఫాన్‌ పఠాన్‌ (9) విఫలమయ్యారు. మోరిస్‌విల్లే బౌలర్లలో పియనార్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సావేజ్‌ ఓ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

సరిపోని ఫించ్‌ మెరుపులు.. కోరె ఆండర్సన్‌ ఊచకోత
101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్‌విల్లే.. మరో 7 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోరిస్‌విల్లే బ్యాటర్‌ కోరె ఆండర్సన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (5 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందు ఫించ్‌ మెరుపులు సరిపోలేదు.

ఛేదనలో ఆరంభంలో నిదానంగా ఆడిన మోరిస్‌విల్లే.. ఆఖర్లో ఆండర్సన్‌తో పాటు పియనార్‌ (12 బంతుల్లో 23 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), షెహన్‌ జయసూర్య (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విజయతీరాలకు చేరింది. మోరిస్‌విల్లే ఇన్నింగ్స్‌లో పార్థివ్‌ పటేల్‌్‌ (9 బంతుల్లో 14; 2 ఫోర్లు), క్రిస్‌ గేల్‌ (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కాలిఫోర్నియా బౌలర్లు పవన్‌ సుయాల్‌, ఆష్లే నర్స్‌, రికార్డో పావెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement