Zim Afro T10 IND Vs PAK: Yusuf Pathan Smashes Mohammad Amir For 24 Runs In One Over, Check Details - Sakshi
Sakshi News home page

Zim Afro T10 IND Vs Pak: యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్‌

Published Sat, Jul 29 2023 7:28 AM | Last Updated on Sat, Jul 29 2023 8:30 AM

Yusuf Pathan Smashes Mohammad Amir For 24 Runs In Over - Sakshi

జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఫైనల్‌కు చేరుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా క్వాలిఫయర్‌-1లో తో డర్బన్ క్వాలండర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన జోబర్గ్‌.. ఫైనల్లో అడుగుపెట్టింది. 141 పరుగుల భారీ లక్ష్యాన్ని 9.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జో బర్గ్‌ ఛేదించింది.ఇక ఈ మ్యాచ్‌లో జోబర్గ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు.

కేవలం 26 బంతుల్లోనే 80 పరుగులు సాధించిన ఫఠాన్‌.. ఒంటి చేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్‌లో జోబర్గ్‌ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. పఠాన్‌ వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన డర్బన్ క్వాలండర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.

డర్బన్‌ బ్యాటర్లలో ఫ్లెచర్‌(39), ఆసిఫ్ అలీ(32) పరుగులతో రాణించారు. ఇక ఇది ఇలా ఉండగా.. క్వాలిఫయర్‌-1లో ఓటమి పాలైన  డర్బన్ క్వాలండర్స్‌.. క్వాలిఫయర్‌-2లో మాత్రం విజయం సాధించి ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో  జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్‌ జట్లు తలపడనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement