వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ టి10 బ్లాస్ట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లోనే 10 సిక్సర్లు.. ఆరు ఫోర్ల సాయంతో శతకం బాదాడు. టి10 బ్లాస్ట్‌లో భాగంగా లెథర్‌బాక్ జెయింట్స్, స్కార్లెట్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లెథర్‌బాక్ జెయింట్స్ పూరన్ దాటికి 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
కాగా నికోలస్ పూరన్‌కు ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఏరికోరి పూరన్‌ను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అసలే వేలంలో తమ చెత్త నిర్ణయాలతో విమర్శలకు గురైన ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. కోట్లు పెట్టు కొన్నందుకు పూరన్ ఇలాంటి ఇన్నింగ్స్ ఐపీఎల్‌లో ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్లెట్ స్కార్చర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్ టియోన్ వెబ్‌స్టర్ 54, ఎవార్ట్ నికోల్‌సన్ 42 పరుగులతో రాణించారు. ఆ తర్వాత నికోలస్ పూరన్(38 బంతుల్లో 101 నాటౌట్, 10 సిక్సర్లు, 6 ఫోర్లు) మెరుపులతో 8.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కాగా లెథర్‌బాక్ జెయింట్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
చదవండి: Mohammed Shami: 'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు'
SA Vs Nz 2nd Test: ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ ఘన విజయం
Genius at work! 😱@nicholas_47 hit a ton off just 3️⃣7️⃣ balls including 6️⃣ fours and 1️⃣0️⃣ massive sixes to take the Leatherback Giants to a comfortable 9️⃣-wicket win! 👏
— FanCode (@FanCode) March 1, 2022
📺 Watch the best moments from this match on #FanCode 👉 https://t.co/c8dKvIy6GE pic.twitter.com/h5G2lrEo8s
Comments
Please login to add a commentAdd a comment