దంచికొట్టిన మిల్లర్‌.. ఆఫ్ఘన్‌ ఓపెనర్‌ పోరాటం వృధా | Abu Dhabi T10 League: David Miller Blasting Fifty, Bangla Tigers Beat Northern Warriors | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన మిల్లర్‌.. ఆఫ్ఘన్‌ ఓపెనర్‌ పోరాటం వృధా

Published Sun, Dec 3 2023 9:49 PM | Last Updated on Mon, Dec 4 2023 8:55 AM

Abu Dhabi T10 League: David Miller Blasting Fifty, Bangla Tigers Beat Northern Warriors - Sakshi

అబుదాబీ టీ10 లీగ్‌లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. బంగ్లా టైగర్స్‌-నార్త్ర్‌న్‌ వారియర్స్‌ మధ్య ఇవాళ (డిసెంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగిపోయారు. బంగ్లా టైగర్స్‌ తరఫున డేవిడ్‌ మిల్లర్‌ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జోర్డన్‌ కాక్స్‌ (16 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వారియర్స్‌ తరఫున ఆఫ్ఘన్‌ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్‌ (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కెన్నార్‌ లెవిస్‌ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2స సిక్సర్లు) పేట్రేగిపోయారు. 138 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్‌ ఆటగాళ్లు పోరాడినప్పటికీ, విజయం బంగ్లా టైగర్స్‌నే వరించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా టైగర్స్‌.. జోర్డన్‌ కాక్స్‌, డేవిడ్‌ మిల్లర్‌ చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 137 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో అవిష్క ఫెర్నాండో (11), కుశాల్‌ మెండిస్‌ (20), షనక (14 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్‌ బౌలర్లలో జేమ్స్‌ నీషమ్‌ 2, సుల్తాన్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

138 పరుగుల లక్ష్య ఛేదనలో వారియర్స్‌ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడినప్పటికీ లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయారు. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్‌, కెన్నార్‌ లెవిస్‌తో పాటు ఆడమ్‌ హోస్‌ (17), జేమ్స్‌ నీషమ్‌ (23 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. టైగర్స్‌ బౌలర్లలో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 2 వికెట్లు పడగొట్టగా.. జాషువ లిటిల్‌, డేనియల్‌ సామ్స్‌, రోహన్‌ ముస్తఫా తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement