ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు షాక్‌.. | South Africa handed injury scare as David Miller picks niggle in SA20 clash | Sakshi
Sakshi News home page

CT 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు షాక్‌..

Jan 28 2025 5:35 PM | Updated on Jan 28 2025 5:50 PM

South Africa handed injury scare as David Miller picks niggle in SA20 clash

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కు ముందు సౌతాఫ్రికా(South Afrcia)కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ స్టార్ బ్యాట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్(David Miller) గాయ‌ప‌డ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మిల్ల‌ర్ మోకాలికి గాయ‌మైంది. ఈ టోర్నీలో పార్ల్ రాయల్స్‌కు సార‌థ్యం వ‌హిస్తున్న మిల్ల‌ర్‌.. డ‌ర్బ‌న్ బ్యాట‌ర్ మార్కస్ స్టోయినిస్ కొట్టిన షాట్‌ను ఆపే క్ర‌మంలో మిల్ల‌ర్ గాయ‌ప‌డ్డాడు.

వెంటనే వైద్య బృందం వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కొన్ని నిమిషాల తర్వాత మిల్లర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రన్ ఛేజ్‌లో బ్యాటింగ్ కూడా రాలేదు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు మిల్లర్‌ గాయం బారిన పడటం ప్రోటీస్ సెలక్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా క్రికెట్‌  ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిల్లర్ చోటు దక్కించుకున్నాడు.

ఒక వేళ ఛాంపియన్స్ ట్రోఫీకి మిల్లర్ దూరమైతే అది సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా వైట్‌బాల్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు మిడిలార్డర్‌లో మిల్లర్ కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఓంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ మిల్లర్‌పై గాయంపై ఇప్పటికే అప్‌డేట్ తెలుసుకున్నట్లు సమాచారం.

అతడి గాయం తీవ్రతను సౌతాఫ్రికా క్రికెట్ వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఎస్‌ఎ టీ20లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ సైతం కాలి గజ్జ గాయంతో బాధపడుతున్నాడు.

పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంగిడి గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గతేడాది జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఎంగిడీ ఇటీవలే క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెట్టాడు. అంతలోనే మళ్లీ ఈ స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ గాయపడ్డాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో ఎంగిడీ కూడా ఉన్నాడు.

అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి మరో 24 రోజుల సమయం ఉండడంతో వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని సౌతాఫ్రికా అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 21న అఫ్గానిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టు:  టెంబా బవుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌
చదవండి: AUS vs SL 1st Test: ట్రావిస్‌ హెడ్‌కు ప్రమోషన్‌..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement