దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది.
దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు.
"పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బీజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది.
మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం
Comments
Please login to add a commentAdd a comment