క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. క్యాచ్ పడదామని భావించిన ఆటగాడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చేతులో పడుతుందనుకున్న బంతి ఫీల్డర్ తలపైన తగిలి నేరుగా బౌండరీ వెళ్లింది. దీంతో సదరు ఫీల్డర్ బౌలర్ ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకీ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
హెల్సెంకీ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో.. జతిన్ మదన్ బౌలింగ్ గులామ్ అబ్బాస్ భట్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ క్యాచ్ తీసుకుంటాడని అంతా భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా బంతి అతని తలను తాకి బౌండరీ వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మన్ ఔటవ్వాల్సింది పోయి అదనంగా నాలుగు పరుగులు సాధించాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి గులామ్ అబ్బాస్ ఔటవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్ సీసీ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జతిన్ మదన్ 20 బంతుల్లో 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 10 ఓవర్లలో 118 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. గోల్డెన్ బాల్ రూల్ అనివార్యమైంది. గోల్డెన్‌బాల్ రూల్‌లో స్టార్ సీసీ విజయాన్ని అందుకుంది.
ఏమిటి గోల్డెన్ బాల్ రూల్..
సాధారణంగా క్రికెట్‌లో మ్యాచ్‌లు టై అయితే.. సూపర్ ఓవర్, బౌలౌట్ లాగే గోల్డెన్ బాల్ రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనంగా ఒక బంతిని ఇస్తారు. ఆ బంతికి సదరు జట్టు రెండు పరుగులు.. అంతకంటే ఎక్కువ సాధిస్తే విజయం సాధించినట్టు.. లేదంటే బౌలింగ్ చేసిన జట్టు విజయం వరిస్తుంది.
చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ
షం‘షేర్’ అంటున్న సీఎస్‌కే.. స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో మరో రికార్డు
pain. pic.twitter.com/sMvF2eZFu3
— That’s so Village (@ThatsSoVillage) February 21, 2022
Comments
Please login to add a commentAdd a comment