golden ball
-
సూపర్ ఓవర్, బౌలౌట్ విన్నాం.. గోల్డెన్ బాల్ రూల్ కథేంటి?
క్రికెట్లో మ్యాచ్‌లు టై అవ్వడం చూస్తుంటాం. అంతర్జాతీయ, జాతీయ, ప్రైవేట్ లీగ్ క్రికెట్లో మ్యాచ్‌లు టై అయితే సూపర్ ఓవర్, బౌలౌట్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు గోల్డెన్ బాల్ రూల్ కూడా మెల్లగా పాపులర్ అవుతుంది. ప్రస్తుతం ఇది యూరోపియన్ లీగ్ క్రికెట్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మన దగ్గర కూడా ఇది వినియోగించే అవకాశం ఉంది. రూల్ పాతదే అయినా కాస్త కొత్తగా కనిపిస్తుంది. మరి దీని కథేంటే చూసేద్దామా.. ఏమిటి గోల్డెన్ బాల్ రూల్.. సూపర్ ఓవర్, బౌలౌట్ లాగే గోల్డెన్ బాల్ రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనంగా ఒక బంతి అవకాశం ఇస్తారు. ఆ బంతికి సదరు జట్టు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. లేదంటే బౌలింగ్ చేసిన జట్టును విజయం వరిస్తుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌ను యూరోపియన్ క్రికెట్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. గతేడాది తొలిసారి డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఈ గోల్డెన్ బాల్ రూల్‌ను ఉపయోగించారు. మాడ్రిడ్ యునైటెడ్, లెవాంటే మధ్య మ్యాచ్ టై అయింది. గోల్డెన్‌బాల్ రూల్‌లో మాడ్రిడ్ యునైటెడ్ విజయం సాధించింది. వకార్ జాఫర్ థర్డ్‌మన్ దిశగా బౌండరీ సాధించడంతో మాడ్రిడ్ యునైటెడ్ ఫస్ట్ గోల్డెన్‌బాల్ విక్టరీని అందుకుంది. తాజాగా యూరోపియన్ టి10 లీగ్ క్రికెట్లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకి టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ఉపయోగించారు. రెండో బ్యాటింగ్ చేసిన హెల్సెంకి టైటాన్స్ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండు పరుగులు చేయడంలో విఫలమైంది. దీంతో సీసీ స్టార్స్ విజయాన్ని అందుకుంది. చదవండి: European T10 League: దరిద్రం నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే 423 రోజుల తర్వాత గ్రౌండ్లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం -
దరిద్రం నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే..
క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. క్యాచ్ పడదామని భావించిన ఆటగాడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చేతులో పడుతుందనుకున్న బంతి ఫీల్డర్ తలపైన తగిలి నేరుగా బౌండరీ వెళ్లింది. దీంతో సదరు ఫీల్డర్ బౌలర్ ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకీ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హెల్సెంకీ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో.. జతిన్ మదన్ బౌలింగ్ గులామ్ అబ్బాస్ భట్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ క్యాచ్ తీసుకుంటాడని అంతా భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా బంతి అతని తలను తాకి బౌండరీ వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మన్ ఔటవ్వాల్సింది పోయి అదనంగా నాలుగు పరుగులు సాధించాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి గులామ్ అబ్బాస్ ఔటవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్ సీసీ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జతిన్ మదన్ 20 బంతుల్లో 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 10 ఓవర్లలో 118 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. గోల్డెన్ బాల్ రూల్ అనివార్యమైంది. గోల్డెన్‌బాల్ రూల్‌లో స్టార్ సీసీ విజయాన్ని అందుకుంది. ఏమిటి గోల్డెన్ బాల్ రూల్.. సాధారణంగా క్రికెట్లో మ్యాచ్‌లు టై అయితే.. సూపర్ ఓవర్, బౌలౌట్ లాగే గోల్డెన్ బాల్ రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనంగా ఒక బంతిని ఇస్తారు. ఆ బంతికి సదరు జట్టు రెండు పరుగులు.. అంతకంటే ఎక్కువ సాధిస్తే విజయం సాధించినట్టు.. లేదంటే బౌలింగ్ చేసిన జట్టు విజయం వరిస్తుంది. చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ షం‘షేర్’ అంటున్న సీఎస్కే.. స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో మరో రికార్డు pain. pic.twitter.com/sMvF2eZFu3 — That’s so Village (@ThatsSoVillage) February 21, 2022 -
ఇలాంటి కీపర్ ఉంటే అంతే సంగతులు
ఒక బంతికి మూడు పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తారు.. అదే రెండు పరుగులు చేస్తే టై అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో బ్యాటింగ్ చేస్తున్న జట్టు గెలిచే అవకాశం లేకుంటే కనీసం టై చేసుకోవాలని చూస్తుంది. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టాడు. కానీ అది ఎక్కువ దూరం పోలేదు. కీపర్ దాన్ని అందుకొని నేరుగా వికెట్లను గిరాటేయకుండా స్టంప్స్ వద్దకు పరుగెత్తుకొచ్చాడు. కానీ అప్పటికే నాన్ స్ట్రైకర్ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి దూసుకొచ్చేశాడు. ఈ క్షణంలో మ్యాచ్ గెలిచామని భావించిన కీపర్ ఆలోచనలో పడిపోయాడు. అయితే నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ వెంటనే స్పందిస్తూ మరో పరుగుకు ప్రయత్నించాడు. స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్ క్రీజు నుంచి కదిలేలోపే అవతలి ఎండ్ బ్యాట్స్‌మెన్ వేగంగా రెండో ఎండ్‌కు చేరుకున్నాడు. (చదవండి : 'బయోబబుల్ నరకం.. కౌంట్‌డౌన్ మొదలెట్టా') దీంతో స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్ పరిగెత్తడంతో కీపర్ బౌలర్‌కు బాల్‌ను విసిరాడు. కానీ బౌలర్ విసిరిన బంతి వికెట్లు తాకలేదు. దీంతో బ్యాటింగ్ జట్టు మ్యాచ్‌ను టై చేసుకొని గోల్డన్ బాల్‌కు వెళ్లింది( ఇది కూడా ఒక సూపర్ ఓవర్ లాగా). గోల్డ్‌న్ బాల్ రూల్ ఏంటంటే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు ఒక బంతిని ఆడే అవకాశం ఇస్తారు. ఆ బంతికి వారు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే విజయం సాధించినట్టు లెక్క. ఈ గోల్డన్ బాల్ రూల్‌లో బ్యాటింగ్ జట్టు కేవలం ఒక్కపరుగే చేయడంతో ఓటమి పాలయింది. కీపర్ పరధ్యానంతో మ్యాచ్ టై అయి గోల్డన్బాల్కు వెళ్లినా బౌలింగ్ జట్టే మ్యాచ్‌ను గెలవడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో అయితే మాత్రం ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదు. మరి ఇలాంటి వింత ఆటను ఎక్కడ చూశామనేగా మీ డౌటు. (చదవండి : సూర్య అద్భుతం.. కానీ నిరాశలో ఉన్నాడు) వెంటనే యూరోపియన్ క్రికెట్ ఇండోర్ సిరీస్‌కు వెళితే ఈ విషయం అర్థమవుతుంది. యూరోపియన్ సిరీస్‌లో భాగంగా కాటలున్యా టైగర్స్, పాక్సీలోనా మధ్య టీ10 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కాటలున్యా టైగర్స్ 10 ఓవర్లో 107 పరగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్సీలోనా చివరి ఓవర్ చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో నిలిచింది. కీపర్ పరధ్యానంతో మ్యాచ్‌ను టై చేసుకున్న పాక్సీలోనా గోల్డన్ బాల్‌కు వెళ్లింది. అయితే అనూహ్యంగా పాక్సీలోనా ఒకటే పరుగు చేయడంతో కాటలున్యా టైగర్స్ విజయం సాధించింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఇలాంటివి ఇండోర్ క్రికెట్లో మాత్రమే సాధ్యమవుతాయి... ఇలాంటి కీపర్ ఉంటే అంతే సంగతులు అని కామెంట్లు పెడుతున్నారు. SCENES! 2 to tie off last delivery, ball in wicket keeper hands and need another run. WHAT TO DO?? 🏏🇪🇸 pic.twitter.com/xFQuaUOreu — European Cricket (@EuropeanCricket) October 28, 2020 -
మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్‌కు గోల్డెన్ బూటు
అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోయినా.. గోల్డెన్ బాల్ మాత్రం ఏస్ క్రీడాకారుడు, ఆ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీకే దక్కింది. 2014 ఫిఫా వరల్డ్ కప్‌కు గాను గోల్డెన్ బూట్ అవార్డును జేమ్స్ రోడ్రిగ్జ్ గెలుచుకున్నాడు. మార్కానా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ చేతుల్లో ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా 0-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయినా.. టోర్నమెంటు మొత్తమ్మీద అతడే మంచి ప్లేయర్ అని ఓటర్లంతా భావించారు. దాంతో గోల్డెన్ బాల్ అతడికే దక్కింది. జట్టు ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌లలోనూ పాల్గొన్న మెస్సీ (27) నాలుగు గోల్స్ కొట్టాడు. ఈ అవార్డుకు పోటీపడినవారిలో అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), నెయ్మార్ (బ్రెజిల్), జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), థామస్ ముల్లర్ (జర్మనీ) ఉన్నారు. ఇక కొలంబియా జట్టుకు ఆరు గోల్స్ అందించిన రోడ్రిగ్జ్ గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు. ఇక ఐదు గోల్స్ చేసిన థామస్ ముల్లర్ వెండి బూటు గెలుచుకున్నాడు. టోర్నమెంటు మొత్తమ్మీద కేవలం నాలుగంటే నాలుగేసార్లు గోల్స్ ఇచ్చిన జర్మన్ గోల్ కీపర్ మాన్యుయెల్ నూయెర్ గోల్డెన్ గ్లోవ్ దక్కించుకున్నాడు. అవార్డుల జాబితా ఇలా ఉంది.. గోల్డెన్ బాల్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), సిల్వర్ బాల్: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బాల్: అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్) గోల్డెన్ బూటు: జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), సిల్వర్ బూటు: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బూటుష్ట్ర నెయ్మార్ (బ్రెజిల్) గోల్డెన్ గ్లోవ్: మాన్యుయెల్ నూయెర్ (జర్మనీ) యంగ్ ప్లేయర్ అవార్డు: పాల్ పోగ్బా (ఫ్రాన్స్) ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ: కొలంబియా