క్రికెట్‌లో మ్యాచ్‌లు టై అవ్వడం చూస్తుంటాం. అంతర్జాతీయ, జాతీయ, ప్రైవేట్ లీగ్ క్రికెట్‌లో మ్యాచ్‌లు టై అయితే సూపర్ ఓవర్, బౌలౌట్‌లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు గోల్డెన్ బాల్ రూల్ కూడా మెల్లగా పాపులర్ అవుతుంది. ప్రస్తుతం ఇది యూరోపియన్ లీగ్ క్రికెట్‌లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మన దగ్గర కూడా ఇది వినియోగించే అవకాశం ఉంది. రూల్ పాతదే అయినా కాస్త కొత్తగా కనిపిస్తుంది. మరి దీని కథేంటే చూసేద్దామా..
ఏమిటి గోల్డెన్ బాల్ రూల్..
సూపర్ ఓవర్, బౌలౌట్ లాగే గోల్డెన్ బాల్ రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనంగా ఒక బంతి అవకాశం ఇస్తారు. ఆ బంతికి సదరు జట్టు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. లేదంటే బౌలింగ్ చేసిన జట్టును విజయం వరిస్తుంది.
ఈ గోల్డెన్ బాల్ రూల్‌ను యూరోపియన్ క్రికెట్‌లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. గతేడాది తొలిసారి డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఈ గోల్డెన్ బాల్ రూల్‌ను ఉపయోగించారు. మాడ్రిడ్ యునైటెడ్, లెవాంటే మధ్య మ్యాచ్ టై అయింది. గోల్డెన్‌బాల్ రూల్‌లో మాడ్రిడ్ యునైటెడ్ విజయం సాధించింది. వకార్ జాఫర్ థర్డ్‌మన్ దిశగా బౌండరీ సాధించడంతో మాడ్రిడ్ యునైటెడ్ ఫస్ట్ గోల్డెన్‌బాల్ విక్టరీని అందుకుంది. తాజాగా యూరోపియన్ టి10 లీగ్ క్రికెట్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకి టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ఉపయోగించారు. రెండో బ్యాటింగ్ చేసిన హెల్సెంకి టైటాన్స్ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండు పరుగులు చేయడంలో విఫలమైంది. దీంతో సీసీ స్టార్స్ విజయాన్ని అందుకుంది.
చదవండి: European T10 League: దరిద్రం నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే
Comments
Please login to add a commentAdd a comment