Match Tie
-
IND vs SL 1st ODI : 'టై'గా ముగిసిన భారత్ - శ్రీలంక తొలి వన్డే (ఫొటోలు)
-
IND VS NZ 3rd T20: అత్యంత అరుదైన 'టై'గా ముగిసిన మ్యాచ్.. సిరీస్ టీమిండియాదే
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో 'సూర్య'ప్రతాపం (111 నాటౌట్) చూపించడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టై ఎలా అంటే..? మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా స్కోర్ 9 ఓవర్ల తర్వాత 75/4గా ఉంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే ఈ సమయానికి స్కోర్లు సమంగా (9 ఓవర్ల తర్వాత 75) ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా నిర్ధారించారు. క్రికెట్ చరిత్రలో ఇలా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌లు టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్‌తో కలిపి మూడు ఉన్నాయి. 2021లో నెదర్లాండ్స్-మలేషియా మధ్య జరిగిన మ్యాచ్, 2021లో మాల్టా-జిబ్రాల్టర్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలాగే డక్‌వర్త్ లూయిస్ టైగా ముగిశాయి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. పేసర్లు మహ్మద్ సిరాజ్ (4/17), అర్షదీప్ సింగ్ (4/37), హర్షల్ పటేల్ చెలరేగడంతో న్యూజిలాండ్ తమ కోటా 20 ఓవర్లు ఆడకుండానే 160 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. ఆరంభంలోనే 2 వికెట్లు (ఫిన్ అలెన్ (3), మార్క్ చాప్మన్ (12)) కోల్పోయినా డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) జట్టును ఆదుకున్నారు. అయితే వీరిద్దరు 16 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో న్యూజిలాండ్ పతనం ఆరంభమైంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏ ఒక్క బ్యాటర్ నిలదొక్కుకోలేకపోయారు. ఏకంగా ముగ్గురు (నీషమ్, మిల్నే, సోధి) డకౌట్లు అయ్యారు. డారిల్ మిచెల్ (10) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. అనంతరం 161 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. కివీస్ పేసర్లు సౌథీ (2/27), ఆడమ్ మిల్నే (1/23), సోధి (1/12) ధాటికి 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను (10) మిల్నే ఔట్ చేయగా.. మరో ఓపెనర్ రిషబ్ పంత్ (11), శ్రేయస్ అయ్యర్ (0)లను సౌథీ, సూర్యకుమార్‌ను (13) సోధి పెవిలియన్‌కు పంపారు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 75/4 వద్ద ఉండగా వర్షం మొదలైంది. దీపక్ హుడా (9), హార్ధిక్ పాండ్యా (30) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను టైగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా, రెండో టీ20లో శతక్కొట్టిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో 25 జరిగే తొలి వన్డేతో 3 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. 27, 30 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సూపర్ ఓవర్, బౌలౌట్ విన్నాం.. గోల్డెన్ బాల్ రూల్ కథేంటి?
క్రికెట్లో మ్యాచ్‌లు టై అవ్వడం చూస్తుంటాం. అంతర్జాతీయ, జాతీయ, ప్రైవేట్ లీగ్ క్రికెట్లో మ్యాచ్‌లు టై అయితే సూపర్ ఓవర్, బౌలౌట్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు గోల్డెన్ బాల్ రూల్ కూడా మెల్లగా పాపులర్ అవుతుంది. ప్రస్తుతం ఇది యూరోపియన్ లీగ్ క్రికెట్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మన దగ్గర కూడా ఇది వినియోగించే అవకాశం ఉంది. రూల్ పాతదే అయినా కాస్త కొత్తగా కనిపిస్తుంది. మరి దీని కథేంటే చూసేద్దామా.. ఏమిటి గోల్డెన్ బాల్ రూల్.. సూపర్ ఓవర్, బౌలౌట్ లాగే గోల్డెన్ బాల్ రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనంగా ఒక బంతి అవకాశం ఇస్తారు. ఆ బంతికి సదరు జట్టు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. లేదంటే బౌలింగ్ చేసిన జట్టును విజయం వరిస్తుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌ను యూరోపియన్ క్రికెట్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. గతేడాది తొలిసారి డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఈ గోల్డెన్ బాల్ రూల్‌ను ఉపయోగించారు. మాడ్రిడ్ యునైటెడ్, లెవాంటే మధ్య మ్యాచ్ టై అయింది. గోల్డెన్‌బాల్ రూల్‌లో మాడ్రిడ్ యునైటెడ్ విజయం సాధించింది. వకార్ జాఫర్ థర్డ్‌మన్ దిశగా బౌండరీ సాధించడంతో మాడ్రిడ్ యునైటెడ్ ఫస్ట్ గోల్డెన్‌బాల్ విక్టరీని అందుకుంది. తాజాగా యూరోపియన్ టి10 లీగ్ క్రికెట్లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకి టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ఉపయోగించారు. రెండో బ్యాటింగ్ చేసిన హెల్సెంకి టైటాన్స్ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండు పరుగులు చేయడంలో విఫలమైంది. దీంతో సీసీ స్టార్స్ విజయాన్ని అందుకుంది. చదవండి: European T10 League: దరిద్రం నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే 423 రోజుల తర్వాత గ్రౌండ్లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం -
దరిద్రం నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే..
క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. క్యాచ్ పడదామని భావించిన ఆటగాడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చేతులో పడుతుందనుకున్న బంతి ఫీల్డర్ తలపైన తగిలి నేరుగా బౌండరీ వెళ్లింది. దీంతో సదరు ఫీల్డర్ బౌలర్ ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకీ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హెల్సెంకీ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో.. జతిన్ మదన్ బౌలింగ్ గులామ్ అబ్బాస్ భట్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ క్యాచ్ తీసుకుంటాడని అంతా భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా బంతి అతని తలను తాకి బౌండరీ వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మన్ ఔటవ్వాల్సింది పోయి అదనంగా నాలుగు పరుగులు సాధించాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి గులామ్ అబ్బాస్ ఔటవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్ సీసీ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జతిన్ మదన్ 20 బంతుల్లో 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 10 ఓవర్లలో 118 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. గోల్డెన్ బాల్ రూల్ అనివార్యమైంది. గోల్డెన్‌బాల్ రూల్‌లో స్టార్ సీసీ విజయాన్ని అందుకుంది. ఏమిటి గోల్డెన్ బాల్ రూల్.. సాధారణంగా క్రికెట్లో మ్యాచ్‌లు టై అయితే.. సూపర్ ఓవర్, బౌలౌట్ లాగే గోల్డెన్ బాల్ రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనంగా ఒక బంతిని ఇస్తారు. ఆ బంతికి సదరు జట్టు రెండు పరుగులు.. అంతకంటే ఎక్కువ సాధిస్తే విజయం సాధించినట్టు.. లేదంటే బౌలింగ్ చేసిన జట్టు విజయం వరిస్తుంది. చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ షం‘షేర్’ అంటున్న సీఎస్కే.. స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో మరో రికార్డు pain. pic.twitter.com/sMvF2eZFu3 — That’s so Village (@ThatsSoVillage) February 21, 2022 -
ఫలితం తేలేవరకు ‘సూపర్ ఓవర్లు’
మెల్బోర్న్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్ కూడా ‘టై’గా ముగిసిన తర్వాత బౌండరీల లెక్కన విజేతను నిర్ణయించడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. అలాంటి వివాదానికి అవకాశం ఇవ్వకుండా ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు బిగ్‌బాష్ లీగ్‌లో కొత్త నిబంధనతో ముందుకు వచి్చంది. మ్యాచ్‌లో స్కోర్లు సమమై, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా ‘టై’గా ముగిస్తే ఆ వెంటనే రెండో సూపర్ ఓవర్ కూడా ఆడిస్తారు. అందులో కూడా ఇరు జట్లు సమంగా నిలిస్తే మరో సూపర్ ఓవర్ కూడా ఆడాల్సి ఉంటుంది. తుది ఫలితం తేలే వరకు దీనిని కొనసాగిస్తారు. ఫుట్‌బాల్, హాకీ పెనాల్టీ షూటౌట్లలో స్కోరు సమమైతే ఫలితం తేలే వరకు షూటౌట్ కొనసాగే తరహాలోనే బిగ్ బాష్ నిర్వాహకులు కొత్త రూల్‌ను రూపొందించారు. ముందుగా ఈ నిబంధనను పురుషుల, మహిళల బిగ్‌బాష్ లీగ్‌ల ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. లీగ్ దశలో సూపర్ ఓవర్ కూడా సమమైతే మాత్రం మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించి ఇరు జట్లకు సమంగా పాయింట్లు కేటాయిస్తారు. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
ప్రపంచ కల నెరవేరింది
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది... ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది. ఔను...! ఇంగ్లండ్ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది... లండన్ : ఇంగ్లండ్ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఓవర్ ఎలిమినేటర్ పద్ధతిలో ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విలియమ్సన్ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్ (3/43), ఫెర్గూసన్ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్‌హోమ్ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటం, బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో తేరుకుంది. నికోల్స్ నిలిచాడు... లాథమ్ ఆడాడు కివీస్ ఓపెనింగ్ జంట నికోల్స్, గప్టిల్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపిన గప్టిల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి కివీస్‌కు ప్లంకెట్ షాకిచ్చాడు. అతడి గుడ్ లెంగ్త్ బంతి విలియమ్సన్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్‌ను సాగనంపాడు. అంపైర్ ఎరాస్మస్ తప్పుడు నిర్ణయానికి రాస్ టేలర్ (15) బలయ్యాడు. ఆల్‌రౌండర్ నీషమ్ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. గ్రాండ్‌హోమ్ (16) అండగా లాథమ్ బండి లాగించాడు. వోక్స్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్‌ట్నర్ (5 నాటౌట్) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇంగ్లండ్ కష్టంగానైనా అందుకుంది... ఇంగ్లండ్ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతే ఓపెనర్ జేసన్ రాయ్ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్ ఎరాస్మస్ ఔటివ్వకపోవడంతో కివీస్ సమీక్ష కోరింది. బంతి లెగ్ స్టంప్ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్‌ను ఊగిసలాటలో పడేసి వికెట్ దక్కించుకున్నాడు. రూట్ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్హోమ్పై ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. బెయిర్ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్ (9) పేలవ షాట్‌కు ఔటయ్యాడు. అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్–బట్లర్ ఐదో వికెట్‌కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు. సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్ ఓవర్లో బట్లర్ షాట్‌కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్ పోరాడుతున్నా... వోక్స్ (2)ను పెవిలియన్ చేర్చి కివీస్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్ (10), ఆర్చర్ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి నీషమ్ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్ తొలి రెండు బంతులకు స్టోక్స్ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్‌లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్ త్రో స్టోక్స్‌కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్ (0), వుడ్ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి ఐదు ఓవర్లు హైడ్రామా... ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్ రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్ (46.1), ప్లంకెట్ (48.3), ఆర్చర్ (48.6) ఔటవ డంతో కప్ న్యూజిలాండ్‌దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్ సిక్స్, ఓవర్ త్రో రూపంలో 2 ప్లస్ 4 పరుగులు రావడంతో తలకిందులైంది. బౌల్ట్ క్యాచ్... సిక్స్... మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్ పాయింట్ నీషమ్ ఓవర్లో స్టోక్స్ కొట్టిన సిక్స్ షాట్. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్ మిడ్ వికెట్‌లోకి భారీ షాట్ ఆడగా... బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్‌కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్‌ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్ గప్టిల్ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్ నమోదైంది. బోనస్‌గా స్టోక్స్‌కు లైఫ్ వచ్చింది. ప్రధాన పేసర్ అయిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్‌కు వేదన మిగిల్చింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ (ఎల్బీడబ్ల్యూ) వుడ్ 15; లాథమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 16; సాన్‌ట్నర్ (నాటౌట్) 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241 వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240. బౌలింగ్: వోక్స్ 9–0–37–3; ఆర్చర్ 10–0–42–1; ప్లంకెట్ 10–0–42–3; వుడ్ 10–1–49–1; రషీద్ 8–0–39–0; స్టోక్స్ 3–0–20–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9, స్టోక్స్ (నాటౌట్) 84; బట్లర్ (సి) సబ్ (సౌతీ) (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ (రనౌట్) 0; మార్క్ వుడ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241. బౌలింగ్: బౌల్ట్ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్ 10–2–25–1, ఫెర్గూసన్ 10–0–50–3, నీషమ్ 7–0–43–3, సాన్‌ట్నర్ 3–0–11–0. సూపర్ ఓవర్ సాగిందిలా... నోట్: సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్ 17 బౌండరీలు సాధించింది. స్టోక్స్... మాస్టర్ స్ట్రోక్... ప్రపంచ కప్ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్‌కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్ స్టోక్స్‌కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్‌కు ఒక కప్ (2017 టి20 ప్రపంచ కప్) చేజారింది. భారత్ వేదికగా జరిగిన నాటి కప్ ఫైనల్లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో కార్లొస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండీస్‌కు కప్‌ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్ పిచ్ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్‌లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది. గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గప్టిల్‌ను ఓదార్చుతున్న నీషమ్ -
పంజాబ్‌కు ‘సూపర్’ విజయం
కోల్‌కతా: భారత వెటరన్ స్టార్స్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మెరుపులతో ఉత్కం‘టై’న మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ ఓవర్‌తో గెలిచింది. ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ సూపర్‌లీగ్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో కర్ణాటకపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. అనిరుధ జోషి (19 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 1 ఫోర్) ధాటిగా ఆడాడు. తర్వాత 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 158 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. పంజాబ్ ఓపెనర్ మన్దీప్ సింగ్ (45; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, వన్‌డౌన్‌లో దిగిన కెప్టెన్ భజ్జీ (19 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), యువీ (25 బంతుల్లో 29; 5 ఫోర్లు) తమ అనుభవాన్ని చాటారు. ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడించగా మొదట పంజాబ్ 15 పరుగులు చేసింది. తర్వాత కర్ణాటక 11 పరుగులే చేసి ఓడింది. గ్రూప్ ‘ఎ’లో మరో మ్యాచ్‌లో ముంబై 13 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై గెలిచింది. గ్రూప్ ‘బి’లో రిషభ్ పంత్ (58; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటికి ఢిల్లీ 8 వికెట్ల తేడాతో తమిళనాడుపై... బరోడా 17 పరుగులతో బెంగాల్‌పై విజయం సాధించాయి. -
చివరి బంతికి సిక్స్... మ్యాచ్ టై
నాటింగ్ హామ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ 'టై'గా ముగిసింది. రెండు జట్లు సమాన స్కోరు సాధించడంతో ఫలితం తేలలేదు. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ నాటకీయ ఫక్కీలో డ్రా అయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. మాథ్యూస్(73), ప్రసన్న(59) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విలే, ప్లంకెట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అలీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 287 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరి వరకు అద్భుతంగా పోరాడింది. లోయర్ ఆర్డర్ లో ప్లంకెట్ మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను 'టై'గా ముగించాడు. చివరి బంతికి సిక్స్ బాదడంతో మ్యాచ్ డ్రా అయింది. 10వ స్థానంలో బ్యాటింగ్ దిగిన పంక్లెట్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ తో 22 పరుగులు బాదాడు. వోక్స్(95), బట్లర్(92), మోర్గాన్(43) రాణించారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్, మాథ్యూస్, ప్రదీప్ రెండేసి వికెట్లు తీశారు. వోక్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. -
తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై
ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 40 నిమిషాల సమయంలో ఇరు జట్లు 39 పాయింట్లే సాధించడంతో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు. తొలి అర్ధభాగంలో 20-12తో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్ధభాగంలో తమ జోరును కొనసాగించలేక పోయింది. జైపూర్ అటగాళ్లు తమ దాడిని ఉదృతం చేయడంతో రెండు జట్లను విజయం దోబుచులాడింది. మ్యాచ్ చివరి సెకన్ వరకూ ఉత్కంఠ నెలకొన్న ఏ జట్టూ విజయాన్ని సాధించలేకపోయింది. సొంత స్టేడియంలో ఆడుతున్నప్పటికీ విజయాన్ని సాధించలేక పోవడంతో అభిమానులు నిరాశ చెందారు. -
కోల్‌కతాపై రాజస్థాన్ 'బౌండరీ' విక్టరీ
అబుదాబి: ఐపీఎల్ 7లో అత్యంత ఉత్కంతభరితంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ విజయం సాధించింది. మ్యాచ్ టై అవడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడించారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై గా ముగియడంతో బౌండరీ కౌంట్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులే చేసింది. అయితే మొత్తం మ్యాచ్‌లో రాజస్థాన్ 17 బౌండరీలు కొట్టగా, కోల్‌కతా 12 బౌండరీ సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రహానే అర్థ సెంచరీ(72)తో రాణించాడు. వాట్సన్ 33, శామస్సన్ 20, స్మిత్ 19 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేసింది. గంభీర్(45) తొలిసారి రాణించినా కోల్‌కతాకు విజయం దక్కలేదు.