తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై | telugu titans and jaipur pink panthers match has tie | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై

Published Tue, Aug 4 2015 9:12 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై

తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై

ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత 40 నిమిషాల సమయంలో ఇరు జట్లు 39 పాయింట్లే సాధించడంతో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు. తొలి అర్ధభాగంలో 20-12తో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్ధభాగంలో తమ జోరును కొనసాగించలేక పోయింది.

జైపూర్ అటగాళ్లు తమ దాడిని ఉదృతం చేయడంతో రెండు జట్లను విజయం దోబుచులాడింది. మ్యాచ్ చివరి సెకన్ వరకూ ఉత్కంఠ నెలకొన్న ఏ జట్టూ విజయాన్ని సాధించలేకపోయింది. సొంత స్టేడియంలో ఆడుతున్నప్పటికీ విజయాన్ని సాధించలేక పోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement