అబుదాబి: ఐపీఎల్ 7లో అత్యంత ఉత్కంతభరితంగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాజస్థాన్ విజయం సాధించింది. మ్యాచ్ టై అవడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడించారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై గా ముగియడంతో బౌండరీ కౌంట్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ను విజేతగా ప్రకటించారు.
సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులే చేసింది. అయితే మొత్తం మ్యాచ్లో రాజస్థాన్ 17 బౌండరీలు కొట్టగా, కోల్కతా 12 బౌండరీ సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రహానే అర్థ సెంచరీ(72)తో రాణించాడు. వాట్సన్ 33, శామస్సన్ 20, స్మిత్ 19 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేసింది. గంభీర్(45) తొలిసారి రాణించినా కోల్కతాకు విజయం దక్కలేదు.
కోల్కతాపై రాజస్థాన్ 'బౌండరీ' విక్టరీ
Published Tue, Apr 29 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement