యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెలరేగిపోయాడు. మోరిస్‌విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్.. టెక్సస్ ఛార్జర్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 23) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి సౌతాఫ్రికా మాజీ టెస్ట్ బౌలర్ డేన్ పైడ్ట్ (2/15), విండీస్ నవీన్ స్టివర్ట్ (1/5) తోడవ్వడంతో టెక్సస్ ఛార్జర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకు పరిమితమైంది.
✌️wickets in his first over for Sreesanth 💪#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/Pm5kAUyimb
— US Masters T10 (@USMastersT10) August 23, 2023
ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ డారెన్ స్టీవెన్స్ 18 బంతుల్లో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ డంక్ (15), తిసాక పెరీరా (12), ఉపుల్ తరంగ (13) తలో చేయి వేశారు. మహ్మద్ హఫీజ్ (8), ముక్తర్ అహ్మద్ (2), సోహైల్ తన్వీర్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు.
Difference maker in his first outing with the ball 💪
— US Masters T10 (@USMastersT10) August 23, 2023
Hafeez, take a bow! 🙇♂️🙇♀️#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/tKfJDx0U2G
K̶e̶y̶ Massive wickets 🤝 Professor Hafeez@MHafeez22#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/erlsKDVEBu
— US Masters T10 (@USMastersT10) August 23, 2023
చెలరేగిన పాక్ బౌలర్లు..
110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్‌విల్లే యూనిటీ.. పాక్ బౌలర్లు మహ్మద్ హఫీజ్ (2-0-10-3), సోహైల్ తన్వీర్ (2-0-8-2), విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్ (2-0-10-2), లంక బౌలర్ తిసార పెరీరా (2-0-16-1) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 75 పరుగులకే పరిమితమైంది. షెహన్ జయసూర్య (22) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లలో కోరె ఆండర్సన్ (16 నాటౌట్) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. ఫలితంగా టెక్సస్ ఛార్జర్స్ 34 పరుగుల తేడాతో మోరిస్‌విల్లేను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment