యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్-2023లో టెక్సాస్ ఛార్జర్స్ ఫైనల్‌కు చేరింది. ఫ్లోరిడా వేదికగా కాలిఫోర్నియా నైట్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టెక్సాస్ ఫైనల్లో అడుగుపెట్టింది. టెక్సాస్ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు ఆల్‌రౌండర్, పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాలిఫోర్నియా ఇన్నింగ్స్‌లో కల్లిస్(56 నాటౌట్), మిలాంద్ కుమార్(41) పరుగులతో అద్భుతంగా రాణించారు. టెక్సాస్ బౌలర్లలో మహ్మద్ హాఫీజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు.
హాఫీజ్ విధ్వంసం..
140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ ఛార్జర్స్ కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. టెక్సాస్ ఛార్జర్స్ బ్యాటర్లలో హాఫీజ్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను ఈ పాకిస్తానీ ఆటగాడు అందుకున్నాడు.
ఓవరాల్‌గా 24 బంతులు ఎదుర్కొన్న హాఫీజ్ 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ముక్తార్ అహ్మద్(40) కూడా రాణించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో న్యూయార్క్ వారియర్స్‌తో టెక్సాస్ ఛార్జర్స్ తాడోపేడో తెల్చుకోనుంది.
చదవండి: PAK vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్ ఆటగాడు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! 40 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment