సిక్సర్ల మోత మోగించిన రాబిన్‌ ఉతప్ప.. కేవలం 34 బంతుల్లోనే..! | Sakshi
Sakshi News home page

సిక్సర్ల మోత మోగించిన రాబిన్‌ ఉతప్ప.. కేవలం 34 బంతుల్లోనే..!

Published Sun, Mar 17 2024 8:26 PM

Legends Cricket Trophy 2024: Rajasthan Kings Captain Robin Uthappa Slams Blasting Fifty Vs Dubai Giants - Sakshi

శ్రీలంకలో జరుగుతున్న లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ 2024లో భాగంగా దుబాయ్‌ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రాబిన్‌ ఉతప్ప శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఉతప్ప సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

ఉతప్పతో పాటు హమిల్టన్‌ మసకద్జ (19 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతురంగ డిసిల్వ (19 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో పెరీరా (16 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ కింగ్స్‌ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

దుబాయ్‌ బౌలర్లలో పవన్‌ సుయాల్‌,సెక్కుగే ప్రసన్న, సచిత్‌ పతిరణ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ లీగ్‌లో రాబిన్‌ ఉతప్ప భీకర ఫామ్‌లో ఉన్నాడు. 6 మ్యాచ్‌ల్లో నాలుగు అర్దసెంచరీలు సాధించాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement