రాబిన్ ఉతప్ప సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్ పై భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రాబిన్ ఉతప్ప సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్ పై భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్, భారత జట్ల మధ్య అనధికార వన్డే మ్యాచ్ జరిగింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ జట్టులో అత్యధికంగా మిచెల్ 51, లాథమ్ 37, కచోపా 45, డెవ్ సిచ్ 48 పరుగులు చేశారు. భారత బౌలర్లలో డీఎస్ కులకర్ణి, రోహిత్ శర్మ, మెనేరియా మూడేసి వికెట్లు పడగొట్టారు.
ఆతర్వాత 258 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 44.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. ఊతప్ప 103, చాంద్ 94, తారే 37, జాదవ్ 15 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిల్నే కు మూడు వికెట్లు దక్కాయి.