తప్పంత ఫాస్ట్ బౌలర్లదే: ధోని | Mahendra Singh Dhoni blames pacers for New Zealand series loss | Sakshi
Sakshi News home page

తప్పంత ఫాస్ట్ బౌలర్లదే: ధోని

Published Tue, Jan 28 2014 9:11 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

తప్పంత ఫాస్ట్ బౌలర్లదే: ధోని

తప్పంత ఫాస్ట్ బౌలర్లదే: ధోని

ఫాస్ట్ బౌలర్ల వైఫల్యామే సిరీస్ కోల్పోవడానికి కారణమైందని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించారు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను 0-3 తేడాతో  ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన కీలక నాలుగవ వన్డేల్లో కివీస్ జట్టు 48.1 ఓవర్లలోనే 279 పరుగుల లక్ష్యాన్ని అధిగమించి.. సిరీస్ ను సొంతం చేసుకున్నారు.
 
చివరి ఓవర్లలో న్యూజిలాండ్ ఆటగాళ్లను కట్టడి చేయలేకపోగా.. ఫాస్ట్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారని ధోని అన్నారు. ప్రతి ఓవర్ లో బౌండరీని సమర్పించుకోవడంతో న్యూజిలాండ్ జట్టుపై ఒత్తిడి పెంచలేకపోయిందని ధోని అన్నారు. ఫాస్ట్ బౌలర్ల తీరు తీవ్ర నిరాశకు గురి చేసింది అని మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ధోని వ్యాఖ్యలు చేశారు. స్పిన్నర్లు రవిచంద్రన్ ఆశ్విన్, రవీంద్ర జడేజాల బౌలింగ్ పై ధోని ప్రశంసల వర్షం కురిపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement