5 వన్డేలు, మూడు టి20లు | India to visit New Zealand from January 23 | Sakshi
Sakshi News home page

5 వన్డేలు, మూడు టి20లు

Published Wed, Aug 1 2018 1:17 AM | Last Updated on Wed, Aug 1 2018 1:17 AM

India to visit New Zealand from January 23 - Sakshi

వెల్లింగ్టన్‌: భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఐదు వన్డేలు, మూడు టి20లు ఆడేందుకు వచ్చే ఏడాది మొదట్లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. జనవరి 23న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 13న మూడో టి20 మ్యాచ్‌తో ఈ పర్యటన ముగుస్తుంది. మంగళవారం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ పర్యటన షెడ్యూల్‌  విడుదల చేసింది. తొలి టి20, మూడో టి20 మ్యాచ్‌లు న్యూజిలాండ్‌ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 నుంచి) మొదలవుతాయి. ఆక్లాండ్‌లో జరిగే రెండో టి20ని మాత్రం గంట ముందుకు జరిపారు. వన్డేలన్నీ న్యూజిలాండ్‌ సమయం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30 నుంచి) నిర్వహించనున్నారు.

పర్యటన షెడ్యూల్‌ 
జనవరి 23: తొలి వన్డే (నేపియర్‌) 
జనవరి 26: రెండో వన్డే (మౌంట్‌ మాంగనీ) 
జనవరి 28: మూడో వన్డే (మౌంట్‌ మాంగనీ) 
జనవరి 31: నాలుగో వన్డే (హామిల్టన్‌) 
ఫిబ్రవరి 3: ఐదో వన్డే (వెల్లింగ్టన్‌) 
ఫిబ్రవరి 6: తొలి టి20 (వెల్లింగ్టన్‌) 
ఫిబ్రవరి 8: రెండో టి20 (ఆక్లాండ్‌) 
ఫిబ్రవరి 13: మూడో టి20 (హామిల్టన్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement